
Pension For Gig Workers: గిగ్ వర్కర్లకు పెన్షన్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
గిగ్ వర్కర్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది.
ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఇ-కామర్స్ సంస్థలైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఉబర్ వంటి అగ్రిగేటర్ల ద్వారా పనిచేసే గిగ్ వర్కర్లకు పెన్షన్ అందించే ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా, ఈ సంస్థల నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌గా వసూలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం కార్మిక మంత్రిత్వ శాఖ, గిగ్ వర్కర్ల యూనియన్లు, అగ్రిగేటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
Details
ఎలా పనిచేస్తుంది?
ప్రతిపాదిత పథకం ప్రకారం, ప్లాట్‌ఫామ్ అగ్రిగేటర్లు గిగ్ వర్కర్ల ఆదాయంపై 2 శాతం మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి.
ఇది వర్కర్ల సంపాదనలో భాగంగా ఉండదు, వారి వేతనాల నుంచి మినహాయించరు.
ఒక వర్కర్ ఒక్కో ఆర్డర్ ద్వారా రూ.15 సంపాదిస్తే, దానికి 2 శాతం అంటే 30 పైసలు పెన్షన్ ఫండ్‌లో జమ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫండ్‌ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహించనుంది.
గిగ్ వర్కర్లకు ఉద్యోగుల్లానే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయించనున్నారు.
రాబోయే రెండు మూడు వారాల్లో ఈ స్కీమ్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం
Details
2025-26 బడ్జెట్‌లో కీలక ప్రణాళికలు
గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ప్రకటించింది.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది.
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఆరోగ్ బీమా సదుపాయం కల్పించడం లాంటి కార్యక్రమాలను ప్రకటించింది.
భవిష్యత్ అంచనాలు
ప్రస్తుతం దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. - 2024 ఆర్థిక సర్వే ప్రకారం, 2030 నాటికి ఈ సంఖ్య 23 కోట్లకు చేరొచ్చు.
ఈ పెన్షన్ పథకం అమలైనట్లయితే, లక్షలాది గిగ్ వర్కర్ల భవిష్యత్తుకు భద్రత లభించనుంది.
మొత్తంగా కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం గిగ్ వర్కర్లకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రతను కల్పించే గొప్ప చర్యగా కనిపిస్తోంది.