
Interest Rates Cut: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ .. కీలక రెపో రేట్ 25 పాయింట్లు తగ్గించిన ఆర్బిఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.
ఈ సమావేశాల ద్వారా దేశంలో లిక్విడిటీని సమతుల్యంలో ఉంచడం తోపాటు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకుని కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటనల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేరకు కీలక రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించబడింది. దీనివల్ల ఈఎంఐ చెల్లిస్తున్న వ్యక్తులపై భారం కొంతవరకు తగ్గనుంది.
వివరాలు
సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయనకు రెండవ సమావేశం
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇదే మొదటి ఆర్బీఐ సమీక్ష సమావేశం కాగా,గవర్నర్ సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయనకు రెండవ సమావేశం కావడం గమనార్హం.
మల్హోత్రా తన మొదటి సమావేశంలోనూ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే.
గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్,ఇతర అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులకు విరుద్ధంగా వడ్డీ రేట్ల తగ్గింపులను సాగతీతగా కొనసాగించారు.
అయితే,వినియోగంలో క్షీణత రావడం,దేశ ఆర్థిక వృద్ధి రేటు కనిష్ట స్థాయికి చేరడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుండి తప్పించింది.
ఇప్పటికే ఫిబ్రవరిలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి,6.25 శాతానికి తీసుకురావడం జరిగింది.
వివరాలు
ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం:
ఈ నిర్ణయం 2020 మే నెల తర్వాత తొలిసారిగా తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు కావడం విశేషం. అంటే గత 30 నెలలుగా రెపో రేటు స్థిరంగా కొనసాగుతూ వచ్చింది.
2025 ప్రారంభం నుంచి ఇప్పటికే రెండు సార్లు వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపులు జరిగాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,ఈ ఏడాది మరో రెండు సార్లు వడ్డీ రేట్ల తగ్గింపులు జరుగే అవకాశముందని అంచనా.
జూలై నెలలో ఒకసారి,ఆగస్టు తర్వాత రెండోసారి, మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది.