LOADING...
Dhanush: 'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్‌ఫుల్‌ స్పీచ్‌
'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్‌ఫుల్‌ స్పీచ్‌

Dhanush: 'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్‌ఫుల్‌ స్పీచ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో ధనుష్‌. ఈ చిత్రంలో ఆయనతో పాటు నటించిన మరో ప్రముఖ నటుడు నాగార్జున. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో సినీ బృందం పాల్గొంది. ఈ ఈవెంట్‌లో ధనుష్ చేసిన ఓ పవర్ఫుల్ ప్రసంగం అభిమానుల్లో ఉద్వేగాన్ని కలిగించింది.

వివరాలు 

23 ఏళ్లుగా నా పక్కన నిలిచిన నా కుటుంబసభ్యులు మీరే 

ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ,"నేను ఎప్పుడూ నా వంతు కృషిని శ్రద్ధగా చేస్తూ ఉత్తమ పనితీరు అందించేందుకు పాటుపడతాను. నా మీదా, నా సినిమాల మీదా ఎంత విమర్శలు, నెగెటివ్ ప్రచారం జరిగినా, వారికివచ్చేదేమీ లేదు. సినిమాల విడుదలకు ముందు నెలకో రెండుసార్లు ఏదో ఒక వివాదం లేదా కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేం చేయలేరు. ఎందుకంటే నాకు నా అభిమానుల అండ ఎప్పుడూ ఉంది. ఈ రకమైన డ్రామాలను మానేయండి. ఇక్కడ ఉన్నవాళ్లంతా కేవలం అభిమానులు కాదు, గత 23 ఏళ్లుగా నా పక్కన నిలిచిన నా కుటుంబసభ్యులు. మీరెన్ని విమర్శలు చేసినా, వీరు ఎప్పటికీ నాతో ఉంటారు," అంటూ ధనుష్ తన ఎమోషనల్‌ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వివరాలు 

మన ఆనందం మనలోనే ఉంటుంది: ధనుష్ 

అలాగే, అభిమానులను ఉద్దేశించి ధనుష్ ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు. "మన ఆనందం మనలోనే ఉంటుంది. దాన్ని బయట వెతకాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా ఉండాలంటే మనమే ఆలోచన మార్చుకోవాలి. నా విషయానికొస్తే, బాగా తింటే చాలు నాకు అదే ఆనందం. సంతోషం అనేది అంతకు మించినదేమీ కాదు," అని చెప్పారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల కూడా ధనుష్ నటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''కుబేర చిత్రంలోని ఈ పాత్రను ధనుష్‌ కాకుండా మరెవ్వరూ చేయలేరు.ఆయన చేసిన అభినయం అద్భుతం.ఆయనకు నేషనల్ అవార్డు రావడం ఖాయం''అని పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ,''ఇలా గొప్పగా నటించే ధనుష్‌ దర్శకత్వంలో నేనూ నటించాలని ఉంది. ఆయన ఒక అద్భుతమైన నటుడు''అని తెలిపారు.

వివరాలు 

కథ విన్న వెంటనే అది నాకు ఎంతో నచ్చింది: రష్మిక 

కథానాయిక రష్మిక మందన్నా మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగమవటం నాకు ఎంతో గర్వకారణం. ఈ కథ విన్న వెంటనే అది నాకు ఎంతో నచ్చింది," అని తన అనుభూతులను వ్యక్తపరిచారు.