NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 
    పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం

    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    07:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ఆపరేషన్‌ సిందూర్‌' ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.

    ఈ క్రమంలో వినోద రంగంలోనూ భారత్‌ తన నిర్ణయాలను అమలులోకి తీసుకువస్తోంది.

    కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ 'ఆపరేషన్ సిందూర్' కొనసాగుతున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

    వినోద రంగంలో ఓటీటీ వేదికలు విప్లవాత్మక మార్పులకు దారితీసినప్పటికీ, భారత్‌-పాక్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

    భారత సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు కీలక సూచనలు జారీ చేసింది.

    వివరాలు 

    పాకిస్థాన్‌ మూలాలు ఉన్న ఓటీటీ కంటెంట్‌,మీడియా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం

    ఈ సూచనల ప్రకారం,పాకిస్థాన్‌ మూలాలు ఉన్న ఓటీటీ కంటెంట్‌,మీడియా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంలు, లేదా మధ్యవర్తుల ద్వారా ప్రసారమయ్యే ఏవైనా కార్యక్రమాలను భారత్‌లో పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

    ఇకపై పాకిస్థాన్‌ వెబ్‌ సిరీస్‌లు,సినిమాలు,పాటలు,పాడ్‌కాస్ట్‌లు వంటి ఏ మీడియా కంటెంట్‌ అయినా భారత దేశంలో అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

    దీనిలో భాగంగా, సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా పొందే కంటెంట్‌కూ మినహాయింపు ఉండదని పేర్కొంది.

    వీటితో పాటు, నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇకపై భారత్‌లో పాక్‌ కంటెంట్‌ స్ట్రీమింగ్‌ చేయకూడదని మంత్రిత్వశాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

    తాజానిర్ణయంతో అన్ని ప్రముఖ డిజిటల్ వేదికలు పాకిస్థాన్‌కి సంబంధించిన కంటెంట్‌ను భారతదేశంలో నిలిపివేయాల్సి ఉంటుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

    In the interest of national security, all OTT platforms, media streaming platforms and intermediaries operating in India are advised to discontinue the web-series, films, songs, podcasts and other streaming media content, whether made available on a subscription based model or… pic.twitter.com/8yjP6ULNEU

    — ANI (@ANI) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు  బీసీసీఐ
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్  రాజ్‌నాథ్ సింగ్
    Kia Carens Clavis: కియా సంస్థ కరెన్స్‌ క్లావిస్‌.. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కియా మోటర్స్

    కేంద్ర ప్రభుత్వం

    Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..? భారతదేశం
    OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ  ఓటిటి
    IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025