NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాల‌య్య ప్లాన్ మాములుగా లేదుగా..! 
    తదుపరి వార్తా కథనం
    Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాల‌య్య ప్లాన్ మాములుగా లేదుగా..! 
    బాల‌య్య ప్లాన్ మాములుగా లేదుగా..!

    Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాల‌య్య ప్లాన్ మాములుగా లేదుగా..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ.

    ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అతి త్వరలో నాలుగో సీజన్ ప్రారంభమయ్యేందుకు రెడీ అవుతోంది. 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?

    వివరాలు 

    ఏపీ సీఎం చంద్రబాబుతో 'అన్‌స్టాపబుల్ 4' మొదలు 

    ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్‌తో 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.

    ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరగనుంది.

    ఆయన్ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షోలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది, అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏపీ సీఎం రావడం మాత్రం ఖరారు అయింది.

    వివరాలు 

    Unstoppable With NBK season 4 ఫస్ట్ ఎపిసోడ్ 

    'అన్‌స్టాపబుల్' షోలో ఇంతకు ముందు ఓసారి చంద్రబాబు సందడి చేశారు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ కూడా సీజన్‌ 2లో పాల్గొన్నారు.

    అప్పుడు ఆయన ఏపీకి ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు సీఎం హోదాలో ఆయన వస్తుండటం వలన ఈ ఎపిసోడ్ కు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    ఏపీలో ఎన్నికలకు ముందు పరిస్థితులు, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ వంటి విషయాలను వివరించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'అన్‌స్టాపబుల్ 4'లో సందడి చేయనున్నారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయ్యిందని సమాచారం.

    వివరాలు 

    అల్లు అర్జున్... అలాగే 'లక్కీ భాస్కర్', 'కంగువ' టీమ్స్! 

    అలాగే, ఈ సీజన్‌లో ఇతర భాషలకు చెందిన హీరోలను కూడా ఈ షోకి తీసుకువస్తున్నారు.

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ సూర్య తమ తాజా సినిమాల టీమ్స్ ద్వారా షోలో పాల్గొంటారని సమాచారం.

    దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన తాజా పాన్ ఇండియా సినిమా 'లక్కీ భాస్కర్'. ఆ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ,దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొంటారని సమాచారం.

    ఈ నెల 24వ తేదీన'కంగువ'చిత్ర బృందంతో మరో ఎపిసోడ్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

    ఆ సినిమాల విడుదల సమయాల్లో ఎపిసోడ్స్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ షో ప్రారంభమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహా
    ఓటిటి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి

    ఓటిటి

    Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్! హాయ్ నాన్న
    Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ టాలీవుడ్
    Keeda Cola Aha : ఆహాలోకి వచ్చేస్తున్న 'కీడా కోలా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ఆహా
    Web Series 2023 : 2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే! సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025