Met Gala 2026: న్యూయార్క్‌లో మే 4న మెట్ గాలా 2026 గ్రాండ్ ఈవెంట్ ..భారత్‌లో ఎప్పుడు చూడాలి?
ఈ వార్తాకథనం ఏంటి
మెట్ గాలా 2026 ఈసారి మే 4న అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రముఖ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఈవెంట్‌కు ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "కాస్ట్యూమ్ ఆర్ట్ "గా ప్రకటించారు. ఈ థీమ్‌లో భాగంగా దాదాపు 5,000 ఏళ్లుగా మానవ దుస్తుల ప్రదర్శన, శరీరాన్ని ఫ్యాషన్‌లో ఎలా చూపిస్తారన్న అంశాన్ని ప్రత్యేకంగా చూపించనున్నారు. అలాగే మ్యూజియంలో కొత్తగా ప్రారంభమయ్యే కోడ్ ఎం. నెస్ట్ గెలారీస్ కూడా ఈ ఈవెంట్‌తోనే ఓపెన్ కానుంది. ఇక ఈ ఏడాది డ్రెస్ కోడ్ "Fashion Is Art"గా నిర్ణయించారు.
వివరాలు
భారీగా తరలిరానున్న సెలబ్రిటీస్..
ఈ మెట్ గాలా 2026కు ప్రముఖులు కో-చైర్లుగా బియాన్స్, నికోల్ కిడ్‌మన్, వెనస్ విలియమ్స్, అలాగే ఆనా వింటూర్ వ్యవహరించనున్నారు. అంతేకాదు, డిజైనర్ ఆంథోనీ వాకారెల్లో, ఫిల్మ్ మేకర్ జో క్రావిట్జ్ నేతృత్వంలో హోస్ట్ కమిటీ కూడా ఉండనుంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ సాంచెజ్ బెజోస్ ఈసారి హానరరీ చైర్లుగా పాల్గొంటున్నారు. బాలీవుడ్ నుంచి దర్శకుడు కరణ్ జోహార్ ఈసారి మెట్ గాలాలో తన డెబ్యూ ఇవ్వనున్నారని సమాచారం. ఆయన డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..
అలాగే ఇషా అంబానీ, నటాషా పూనావాలా వంటి భారతీయ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మెట్ గాలా గెస్ట్ లిస్ట్ 400 నుంచి 450 మందికి పరిమితమవుతుంది. ఈసారి కూడా లిసా, జెండయా, రిహానా, కర్దాషియన్-జెన్నర్ ఫ్యామిలీ సభ్యులు హాజరవుతారని అంచనా. ఇక భారతదేశంలో చూస్తే, మెట్ గాలా రెడ్ కార్పెట్ ఎంట్రన్స్‌ను వోగ్ తన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. యూట్యూబ్, టిక్‌టాక్‌లో ఈ లైవ్ చూడొచ్చు. అమెరికా ఈస్ట్రన్ టైమ్ ప్రకారం మే 4న సాయంత్రం 6 గంటలకు లైవ్ ప్రారంభమవుతుంది. అదే భారత కాలమానం ప్రకారం మే 5న తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రసారం అవుతుంది.