Page Loader
Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..
దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. ఇది కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిందని పేర్కొంది. ఈ రోజు (ఫిబ్రవరి 17) ఉదయం 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. భూకంపం కారణంగా భయాందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాలు 

 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం

ఇక దిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానిక వాసులు వెల్లడించారు. ఈ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భూకంప కేంద్రం కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. గత నెల (జనవరి 23) చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీలో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రికార్టర్ స్కేల్ పై 4.3గా నమోదు.. 

వివరాలు 

అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన 

సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా శాంతంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూకంపం మళ్లీ సంభవించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.