
Air India: : మిగిలిన విమానాల ఇంధన స్విచ్‌ల్లో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
తమ యాజమాన్యంలో ఉన్న బోయింగ్ 787,737 విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల్లో ఎలాంటి లోపాలను గుర్తించలేదని ఎయిర్ ఇండియా మంగళవారం ప్రకటించింది. లండన్‌కు బయలుదేరాల్సిన ఒక విమానం ఇంధన స్విచ్‌లలో సమస్య తలెత్తి అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఘటన నేపథ్యంలో,డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఆదేశాలతో సంస్థ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది. భారత్‌లో నమోదు అయిన అన్ని బోయింగ్ విమానాలపై జూలై నెలాఖరు వరకు తనిఖీలు పూర్తిచేయాల్సి ఉందని తెలిపింది. ''బోయింగ్ విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలను ముందస్తు జాగ్రత్త చర్యగా పరిశీలించాం. ఈ తనిఖీల్లో ఎలాంటి సమస్యలను గుర్తించలేదు.డీజీసీఏ సూచించిన గడువులోగా జూలై 12న ఈ తనిఖీలు పూర్తయ్యాయి.ఈ వివరాలను నియంత్రణ సంస్థకు తెలియజేశాము''అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
వివరాలు
ఇంధన కంట్రోల్ స్విచ్‌లు రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు..
అదే సమయంలో, ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంలో ఇంజిన్‌కు ఇంధన సరఫరా ఆగిపోయినట్లు నివేదికల్లో వెల్లడైంది. ఇంధన కంట్రోల్ స్విచ్‌లు రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు మారిపోయినట్లు వెల్లడించారు. ఈ మార్పు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిందని వివరించారు.ఇక ఈ ప్రమాదానికి పూర్తిగా పైలట్లే కారణమని పశ్చిమ దేశాల మీడియా ప్రచారం చేయడాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఖండించిన విషయం తెలిసిందే.
వివరాలు
అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారమే దర్యాప్తు
సోమవారం రాజ్యసభలో విమాన ప్రమాదంపై చర్చ జరిగిన సందర్భంగా మాట్లాడుతూ.. ''ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిందని, దానిని పరిశీలిస్తున్నామని తెలిపారు. తుది నివేదిక వచ్చిన తర్వాత పూర్తి సమాచారం అందుతుందని వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోంది. ఘటనను విదేశీ మీడియా వక్రీకరించి అసత్య ప్రచారం చేయడం సరైంది కాదని అన్నారు. విమాన ప్రమాదాల దర్యాప్తు సంబంధించి నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని, అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతున్నదని'' స్పష్టం చేశారు.