మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్
2014 లో జరిగిన ఎన్నికలల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మే 26న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. నేటి తో ఆయన భాద్యతలను స్వీకరించి 9 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మోదీ 9 ఏళ్ళ పాలన పై విమర్శనాస్త్రాలను సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలను ప్రస్తావించింది. ప్రజలను మోసం చేసినందుకు గానూ ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మోదీకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది.
"నౌ సాల్, నౌ సవాల్'' పేరుతో బుక్ లెట్ విడుదల చేసిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా లేవనెత్తిన అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్రాన్ని 9 ప్రశ్నలు అడుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా 'నౌ సాల్.. నౌ సవాల్' పేరుతో ఓ బుక్‌లెట్ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ తొమ్మిదేళ్ల మోదీ ప్రజలను వంచించినందుకు క్షమాపణ చెప్పాలని, ఈ రోజును 'మాఫీ దివస్'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అడిగే తొమ్మిది ప్రశ్నలకు ప్రధాని మౌనం వీడి సమాధానం చెప్పాలనన్నారు.