కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్; కర్ణాటక సీఎం ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో ఇప్పడు కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో అధిష్ఠానం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ముందుండి నడిపించారు.
సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి కాగా, డీకే శివకుమార్ పీసీసీ చీఫ్‌గా ప్రస్తుతం ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 75 ఏళ్ల సిద్ధరామయ్య ఇదే తన చివరి ఎన్నికలని ప్రకటించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యను సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్
జేడీయూ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సిద్ధరామయ్య
సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కూడా తన తండ్రి ముఖ్యమంత్రి అవుతారని ఖరాఖండిగా చెప్పారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో సిద్ధరామయ్య అత్యంత ప్రజాధారణ పొందిన కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేలింది.
సిద్ధరామయ్య 1983లో భారతీయ లోక్‌దళ్ పార్టీ నుంచి తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో సిద్ధరామయ్య జనతాదళ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పని చేశారు.
పదేళ్ల తరువాత 2004లో జనతాదళ్ (సెక్యులర్)లో చేరారు. ఆ తర్వాత హెచ్‌డి దేవెగౌడతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2008లో సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరి 2013 కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
కాంగ్రెస్
డీకే శివకుమార్ మొదటి నుంచి కాంగ్రెస్ వాదే
ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు.
61ఏళ్ల డీకే శివకుమార్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుంది. కర్ణాటకలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఆయన ఒకరు.
2019లో కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు డీకే తీవ్రంగా శ్రమించారు. ఇది ఆయన పొలిటికల్ కెరీర్‌కు మైలురాయిగా మారింది.
అయితే సిద్ధరామయ్య లాగా కాకుండా డీకే శివకుమార్ కుమార్‌మొదటి నుంచి కాంగ్రెస్ వాది.
1989 నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. శివకుమార్ ప్రస్తుతం పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు.
దిల్లీలోని తీహార్ జైలులో కూడా గడిపారు. అయితే ఈ ఇద్దరు బలమైన నేతల్లో ఒకరిని సీఎంగా ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు సవాల్ అనే చెప్పాలి.