LOADING...
Vice President: సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA ఉపరాష్ట్రపతి అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?
సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?

Vice President: సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA ఉపరాష్ట్రపతి అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఆధ్వర్యంలోని NDA కూటమి ఈ నిర్ణయం తీసుకోగా, ప్రతిపక్ష INDIA బ్లాక్ ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ జూలై 21న అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అవసరమయ్యాయి. INDIA బ్లాక్ అభ్యర్థి ఎంపికపై ఆగస్టు 18న (సోమవారం) కీలక సమావేశం జరగనుంది. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21.

వివరాలు 

INDIA బ్లాక్ అభ్యర్థిని పెట్టకపోతే ఏమవుతుంది? 

INDIA బ్లాక్ అభ్యర్థిని ప్రకటించకపోతే, సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. INDIA బ్లాక్ అభ్యర్థిని పెడితే పరిస్థితి? ఈ సందర్భంగా, NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, INDIA బ్లాక్ అభ్యర్థి మధ్య నేరుగా పోటీ జరుగుతుంది. ఈ ఎన్నికలను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ నిర్వహిస్తుంది. గోప్యమైన బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకటిగానే పరిగణించబడుతుంది.

వివరాలు 

సంఖ్యా బలం ఎవరి వైపు? 

మొత్తం ఎలక్టోరల్ కాలేజ్‌లో 782 మంది ఎంపీలు ఉన్నారు.(లోక్‌సభలో ఒకటి,రాజ్యసభలో ఐదు ఖాళీలను మినహాయించి). విజయం సాధించాలంటే కనీసం 392 ఓట్లు అవసరం. లోక్‌సభ: మొత్తం 542 సభ్యుల్లో NDAకి 293 మంది మద్దతు.INDIA బ్లాక్ వద్ద 249 మంది ఉన్నారు. రాజ్యసభ: మొత్తం 240మంది సభ్యుల్లో NDAకి సుమారు 130 మంది మద్దతు ఉంది. అందువల్ల NDA మిత్రపక్షాలు ఏకగ్రీవంగా రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తే ఆయన విజయం ఖాయం. అయితే NDAలో కొంతమంది విభేదించి INDIA బ్లాక్ అభ్యర్థికి ఓటేస్తే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇకపై INDIA బ్లాక్ తమ అభ్యర్థిని పెడతారా? లేక సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో NDA అభ్యర్థికే మద్దతు ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది.