LOADING...
Delhi: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు 
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు

Delhi: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా EC కి ఇండియా బ్లాక్ నిరసన.. అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దాకా విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు భారీ ర్యాలీ నిర్వహించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా,కాంగ్రెస్‌ ప్రధాన నాయకుడు రాహుల్‌ గాంధీ ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపిస్తూ,పాల్గొన్న ఎంపీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ సహా పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఇక, ఈ ర్యాలీకి ముందస్తుగా అనుమతి తీసుకోలేదని ఢిల్లీలోని పోలీసులు అభ్యంతరం తెలిపారు. ర్యాలీని మధ్యలోనే ఆపే ప్రయత్నం చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న నేతలు బారికేడ్లు ఎక్కి తమ నిరసనను కొనసాగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియా బ్లాక్ నిరసన