
Jagdeep Dhankhar : ఆ మూడున్నర గంటలు జరిగిన పరిణామాలు ధంఖర్ రాజీనామాకు కారణమయ్యాయా?
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక అధికార, విపక్ష పార్టీల మధ్య గట్టి చర్చలు జరగబోతున్నాయన్న అంచనాలు ఉండగా, సమావేశాల మొదటి రోజే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్కర్ ప్రకటించారు.ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనారోగ్య కారణాలే తన రాజీనామాకు కారణమని ధన్‌ఖడ్ వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాపై విపక్ష కాంగ్రెస్ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం అందరిలో ఆసక్తి
ఇది వరకే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ, జాతీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. వర్షాకాల సమావేశాల్లో "ఆపరేషన్ సిందూర్", న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం, బిహార్‌లో ఎన్నికల సమయంలో ఓటర్ల నమోదు వంటి అంశాలను చర్చించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ విషయాలపై తీవ్రమైన చర్చ జరుగుతుందని అందరూ భావిస్తున్న వేళ, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు, సమావేశాల ప్రారంభం తరువాతే వివిధ చర్చలు, వాయిదాలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం
ఇందుకు ముందు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద సంఖ్యలో కాలిన నోట్ల కట్టలు బయటపడటం, ఆపై ఈ అంశంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేయడం గుర్తు పెట్టుకోవాలి. ఇటీవల కేరళ పర్యటనలో భాగంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన, యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. దీనికి కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పేనని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు పదవి కోల్పోవడానికి కారణమయ్యాయని ఓ ప్రచారం కొనసాగుతోంది.
వివరాలు
అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక కారణం
అంతేకాక, పార్లమెంట్ సమావేశాల మొదటి రోజున జగదీప్ ధన్‌ఖడ్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, సమీక్షలు కూడా నిర్వహించారని పలువురు ఎంపీలు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక కారణం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా అనారోగ్యం కారణంగా రాజీనామా చేశారని ప్రకటించినా, దీని వెనుక మరో నిగూఢ విషయం దాగి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
అడ్వయిజరీ కమిటీ సమావేశానికి హాజరు కానీ కేంద్ర మంత్రులు
ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారని సమాచారం. అయితే అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు తిరిగి జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశానికి ఈ ఇద్దరు మంత్రులు హాజరుకాలేదని హాజరు కాలేదని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా వెల్లడించారు. ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుందని సదరు ఎంపీ వివేక్ తంకా సందేహం వ్యక్తం చేశారు.