
NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ!
ఈ వార్తాకథనం ఏంటి
నవరసాలను నభూతోనభవిష్యత్ స్థాయిలో పండించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్.
రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం... ఇలా ప్రతీ భావోద్వేగాన్ని తన నటనతో ప్రదర్శించగలిగిన అద్భుత నటుడు. అందుకే 'నటనలో నీ తర్వాతే ఎవరైనా' అని అంటారు ఆయన్ను చూసినవారంతా.
సింగిల్ టేక్‌లో భారీ డైలాగులు చెప్పగలగడం, అదిరిపోయే స్టెప్పులతో అలరించడం ఆయన ప్రత్యేకత.
ఈ యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
Details
జననం, విద్యాభ్యాసం
ఎన్టీఆర్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్ విద్యను సెయింట్ మేరీ కళాశాలలో పూర్తి చేశారు.
బాలనటుడిగా ప్రస్థానం
పదేళ్ల వయసులో 1991లో వచ్చిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'తో బాల నటుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పుడే తాత ఎన్టీఆర్‌ను పోలిన రూపం ఉండడంతో 'జూనియర్ ఎన్టీఆర్' అనే పేరు స్థిరపడింది.
హీరోగా మొదటి చిత్రం
'నిన్ను చూడాలని' అనే చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. రెమ్యూనేషన్ రూ.3.5 లక్షలు తీసుకొని తల్లికి అందజేశారట.
డ్యాన్స్, పాటలు
ఎన్టీఆర్ బాల్యంలో కూచిపూడి నేర్చుకున్నారు. పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే 'యమదొంగ', 'కంత్రి', 'అదుర్స్', 'నాన్నకు ప్రేమతో', 'రభస' చిత్రాల్లో గాయకుడిగానూ ఆకట్టుకున్నారు.
Details
తాత, కొడుకు పేర్లతో పాత్రలు
'బాద్‌షా' చిత్రంలో తన తాత ఎన్టీఆర్ పేరును, 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో తన కొడుకు అభయ్ రామ్ పేరుతో కలిపి "అభిరామ్" అనే పేరును పాత్రకు పెట్టుకున్నారు. తన తాత హావభావాలను 'యమదొంగ', 'రభస' లాంటి చిత్రాల్లో ప్రతిబింబించారు.
ఒకే సినిమాలో మూడు పాత్రలు
'ఆంధ్రావాలా', 'అదుర్స్', 'శక్తి' చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్, 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేశారు.
డైలాగ్ లేని ఇంటర్వెల్
'నరసింహుడు' చిత్రంలో ఇంటర్వెల్ వరకూ ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. ఇది ఓ వైవిధ్యమైన ప్రయోగం.
Details
ఆదితో డౌట్ క్లియర్ చేసినాడు
'ఆది' చిత్రానికి పరుచూరి బ్రదర్స్ భారీ డైలాగులు రాశారు. వాటిని ఎన్టీఆర్ చెప్పగలడా అని కొందరు సందేహించగా, ఎన్టీఆర్ తన ప్రతిభతో అందరి అనుమానాలు తొలగించారు.
బిగ్ ఈవెంట్
'ఆంధ్రావాలా' ఆడియో వేడుక నిమ్మకూరులో నిర్వహించగా, దాదాపు 10 లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు. రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు.
జపాన్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్
జపాన్‌లో అత్యధిక అభిమానులు ఉన్న ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్. ఆయన నటించిన 'బాద్‌షా' జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అక్కడి వారికి ఆయన డ్యాన్సులు ఎంతో ఇష్టం.
Details
నంబర్ 9 సెంటిమెంట్
ఎన్టీఆర్‌కు నంబర్ 9 అంటే ప్రత్యేక అభిమానం. ఆయన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లన్నీ 9తో ప్రారంభమవుతాయి. 9999 నంబర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఫ్యాన్సీ నంబర్ కొనుగోలు చేశారు.
'అదుర్స్' అంటే స్పెషల్ అటాచ్‌మెంట్
ఆయనకు 'అదుర్స్' చిత్రంపై ప్రత్యేక అభిమానం ఉంది. మాస్ ఇమేజ్‌కి భిన్నంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని సీక్వెల్ చేయాలనే కోరిక ఆయనకు ఉంది.
ఇష్టమైన పాట
'మాతృదేవోభవ' చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాట ఆయనకు ఎంతో ఇష్టం. తరచూ వింటుంటారట.
Details
వంటలు చేయడం అంటే ఇష్టం
ఎన్టీఆర్‌కు వంట చేయడం అంటే ఇష్టం. వెజ్, నాన్ వెజ్, రోటి, పచ్చడి, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలలో నైపుణ్యం ఉంది.
'ఆర్‌ఆర్‌ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు
కొమురం భీమ్‌గా నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.
ప్రస్తుత ప్రాజెక్టులు
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో '#NTR30' అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రం చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే 'కేజీయఫ్' ఫేం ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా కూడా చేస్తున్నారు.