
Nara Lokesh: ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు.. ఇండియాటుడే సదస్సులో మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వానికి తాము రాజకీయంగా పూర్తి మద్దతుగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లో జరిగిన 'ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ 2025' కార్యక్రమంలో పాల్గొని, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పలు బిల్లులు,ఇతర సందర్భాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులు అందుతాయా అన్న ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ,ఎలాంటి షరతులు లేకుండా రాజకీయంగా కేంద్రానికి మద్దతుగా ఉన్నామని తెలిపారు. కేంద్రాన్ని నిధులు అడగడం ఒక రాజకీయ అంశం కాదని,రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. ఈ సంస్కరణలకు కేంద్రం సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడకుండా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.
వివరాలు
మంచి నగరం నిర్మిస్తున్నాం
సుంకాల సవాళ్లను అధిగమించేందుకు సంస్కరణలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సుస్థిరంగా అభివృద్ధి అవుతుందా అన్న ప్రశ్నకు లోకేశ్ సమాధానమిచ్చారు. "భారతదేశానికి 100 అమరావతిలు కావాలి. సైబరాబాద్ కూడా అలా తెచ్చిందే. తెలంగాణదీ లబ్ధి పొందుతోంది. చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు ఉండడం అవసరం. 35 వేల ఎకరాల్లో సమగ్రంగా మంచి నగరం నిర్మిస్తున్నారు. ఫలితాలు భవిష్యత్తులో స్పష్టంగా అందరికి కనిపిస్తాయని భావిస్తున్నాం" అని తెలిపారు.
వివరాలు
టీసీఎస్‌కు తక్కువ రేటుకు భూములిచ్చిన వ్యవహారంపై..
టీసీఎస్‌కు తక్కువ రేటుతో భూములు ఇవ్వడంపై ప్రశ్నించినప్పుడు, లోకేశ్ స్పందిస్తూ, "టీసీఎస్ 25 వేల ఉద్యోగాలు అందిస్తే అది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లాభం. వారు ఇక్కడ మంచి వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి విమర్శలు ఎదుర్కొన్నాం, ఇప్పుడు బెంగళూరు వంటి నగరాల్లో రెండవ విమానాశ్రయాలు ఏర్పాటు అవుతున్నాయి" అన్నారు.
వివరాలు
త్రిభాషా విధానంపై అభిప్రాయం
తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోందని, కేంద్రం పరోక్షంగా హిందీ ప్రోత్సహించాలని చూస్తున్నట్లు ప్రశ్నించినప్పుడు లోకేశ్ స్పందిస్తూ: "మాతృభాష ప్రధానమైనదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. మేము తెలుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. భారతీయులు హిందీ నేర్చుకుంటున్నారు. నా కుమారుడు కూడా ప్రస్తుతం మూడు భాషలు (తెలుగు, హిందీ, జర్మన్, జపనీస్) నేర్చుకుంటున్నాడు. పిల్లలు భాషలు స్వేచ్ఛగా నేర్చుకోవాలి. విదేశాల్లో పని అవకాశాల కోసం కూడా భాషలు నేర్చుకోవడం అవసరం" అని వివరించారు.
వివరాలు
ఉపరాష్ట్రపతి ఎన్నికలు
సి.పి. రాధాకృష్ణన్‌కు మద్దతిస్తారా లేక తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికాకు అని అడిగినప్పుడు, "ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌కే మద్దతుగా నిలుస్తాం" అని తెలిపారు. ఎన్డీయేకు ఎప్పటికీ మద్దతు ఉంటుందా అన్న ప్రశ్నకు, "2029లో ఎన్నికల వరకే కాదు, ఆ తర్వాత కూడా మద్దతుగా నిలబడతాం" అని వెల్లడించారు. 2019లో ఎందుకు వ్యతిరేకించారన్న ప్రశ్నకు "మేము తప్పుచేశామని, ఇప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు."
వివరాలు
స్వచ్ఛమైన రాజకీయాలపై అభిప్రాయం
మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని జైలుకు వెళ్లిన తరువాత రాజీనామా చేయాలనే అంశంపై ప్రశ్నించినప్పుడు, "దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి. ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. అవినీతి పూర్తిగా తొలగించాలి. రాజకీయ నేపథ్యం ఉన్న అవినీతి కేసుల్లో ఏడాదికే తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇది ఇప్పటికీ జరగలేదు. అందుకే సంస్కరణలు అవసరం. మా సూచనలను కేంద్రానికి కూడా తెలిపాం" అని స్పష్టం చేశారు.
వివరాలు
చంద్రబాబు - జగన్ వివాదం
చంద్రబాబును జగన్ జైలుకు పంపించిన విషయం, ఇప్పుడు చంద్రబాబు వచ్చాక జగన్‌ను జైలుకు పంపుతారా అని ప్రశ్నించగా.. "ఇది మా ఎజెండాలో లేదు. చేయాలనుకుంటే వారు ముందే చేసేవాళ్లు. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ధి. చట్ట ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడితే దానికి తగిన ఫలితాలు ఎదుర్కొనాల్సిందే. నా తప్పుల కోసం నా తండ్రే నన్ను జైలుకు పంపతారు. మరో ఆలోచనే లేదు" అని చెప్పారు.
వివరాలు
ఎన్టీఆర్, చంబ్రాబుతో పోల్చితే మీరెలా ప్రత్యేకం
ఎన్.టి.ఆర్, చంద్రబాబుతో పోల్చినప్పుడు, "వారు ఇద్దరూ నాకు స్ఫూర్తిగా నిలుస్తారు. నా జీవితకాల ఉపాధ్యాయుడు నా తండ్రి. కొన్నిసార్లు క్యాబినెట్ సమావేశాల్లో ఆయన ఆలోచనలతో కూడా విభేదిస్తాను. ఆయన వింటారు. ఎవరూ బలవంతంగా రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల సంక్షేమం కోసం, సంస్కరణల కోసం యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
వివరాలు
కర్ణాటక వద్దంటే మేం ఆహ్వానించాం..
కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించిన తర్వాతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించినట్లు లోకేశ్ తెలిపారు. "కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఏపీపై దృష్టి పెడుతున్నాయి. తక్కువ ధరకే భూములు, మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ కావడం వల్ల ఉక్కు కర్మాగారాలు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వచ్చాయి. పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులను మేము అందిస్తున్నాం. స్పేస్ సెక్టార్ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాలను కేటాయించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది" అని వివరించారు.