
Red Alert: రికార్డు స్థాయిలో వర్షాలు.. పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్‌లో రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం,జమ్ముకశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలోని కొన్ని జిల్లాల కోసం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో వచ్చే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆకస్మిక వరదలు,కొండచరియలు విరిగిపోవడం వంటి ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోవచ్చు. జమ్మూకశ్మీర్‌లో పూంచ్,మిర్‌పూర్,రాజౌరి,రియాసీ,జమ్మూ,రాంబన్,ఉదంపూర్,సాంబా,కతువా,దోడా, కిష్టావర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్‌లో కపుర్తలా,జలంధర్,నవాన్‌షేర్,రూప్‌నగర్,మోగా,లుధియానా, బర్నాలా, సంగ్రూర్ జిల్లాలకు హెచ్చరికలు ఇచ్చారు.
వివరాలు
ర్షాకాలంలో సుక్నా డ్యామ్ గేట్లను ఎత్తడం ఇది తొమ్మిదోసారి
హిమాచల్ ప్రదేశ్‌లో మండి, ఉనా, బిలాస్‌పుర్, సిర్‌మౌర్, సోలన్ జిల్లాలకు వార్నింగ్ ఇచ్చారు. హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్, అంబాలా, కురుక్షేత్ర, పంచకుల, SAS నగర్ జిల్లాలకు కూడా హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నిరవధికంగా వర్షాలు కురుస్తున్నందున, చండీఘడ్ అడ్మినిస్ట్రేషన్ సుక్నా డ్యామ్ గేట్లను తెరవడానికి నిర్ణయం తీసుకుంది. సుక్నా డ్యామ్‌లో నీటి స్థాయి 1163 అడుగులకు చేరుకుని డేంజర్ మార్క్ దాటింది. అదనపు నీటిని ఘాజర్ నదిలోకి విడుదల చేస్తున్నారు. వర్షాకాలంలో ఇది సుక్నా డ్యామ్ గేట్లను ఎత్తడం తొమ్మిదోసారి. మండి జిల్లాలోని సుందర్‌నగర్ డివిజన్‌లో కొండచరియలు విరిగిపోవడం వల్ల ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం స్థానిక ప్రాంతాల్లో భయానికి కారణమైంది.