
Jitendra Singh: 2040 కల్లా చంద్రుడిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం, 2040లో భారత్ స్వంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ జెండాను ఎగరేస్తారు. దీని ద్వారా "వికసిత్ భారత్ (Viksit Bharat)" ఖ్యాతిని ప్రపంచానికి చాటుతామని తెలిపారు. అంతుకుముందు, 2026లో మానవరహిత అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించడానికి భారత్ సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయాణాన్ని "వ్యోమ్మిత్ర్" అనే రోబో ద్వారా నిర్వహించనుందని తెలిపారు. ఆ తర్వాత 2027లో భారత్ నేతృత్వంలో తొలి మానవ అంతరిక్ష యాత్రను నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. జితేంద్ర సింగ్ చెప్పిన వివరాల ప్రకారం, 2035లో భారత్‌కు సొంత అంతరిక్ష స్థానం (Bharat Space Station) ఏర్పాటవుతుందని భావిస్తున్నారు.
వివరాలు
శుక్లాపై చర్చ..ప్రతిపక్షాల వాకౌట్
2040లో భారత వ్యోమగామి చంద్రునిపై జెండా ఎగరేసే ఘనతను పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో ఈ ప్రగతికి ప్రధానిగా 2014లో పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మార్పులు ప్రేరణనిచ్చాయని కూడా ఆయన గుర్తు చేశారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భారత వ్యోమగామి శుక్లా గురించి ప్రసంగిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు బిహార్ ఓటర్ జాబితాలో సవరణలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. శుక్లాపై ప్రసంగం పూర్తికావేముందే, ప్రతిపక్షాలు సభను వాకౌట్స్ చేశారు. ఈ వ్యవహారంపై ఎన్డీఏ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందటం,ముందుకు పోవటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని,అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు.
వివరాలు
ప్రశ్నలు అడిగితేనే ప్రజలకు ప్రయోజనం: స్పీకర్
అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ సోషల్ మీడియా వేదికగా శుక్లా ఘనతను ప్రశంసించారు. ఆయన చెప్పినట్లే, అంతరిక్ష యాత్ర దేశానికి గర్వకారణం అని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మన వ్యోమగామి నిర్వహించిన ప్రయోగాలు మానవాళికి ఉపయోగకరమని తెలిపారు. సభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు అర్థవంతమైన ప్రశ్నలు అడిగితేనే ప్రజలకు లాభమవుతుందని, కానీ సమావేశాన్ని మధ్యలో నిలిపివేసే విధంగా నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టత ఇచ్చారు.