LOADING...
Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు 
కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగ్గలబెట్టడం (Stubble Burning) దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. తాజా విచారణలో సుప్రీంకోర్టు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంది. ఇది మిగతా వారికే బలమైన సందేశంగా పనిచేస్తుందని న్యాయస్థానం భావించింది.

వివరాలు 

న్యాయస్థానం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా, వాటికి ఫలితం రావడం లేదు: సుప్రీం 

ఈ విషయంపై అమికస్ కూరీ అపరాజిత్ సింగ్, పంట వ్యర్థాలను తగలబెట్టకుండా రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. అయినప్పటికీ ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు తమకు చెప్పారనే కథనే రైతులు మళ్లీ మళ్లీ చెప్తున్నారని న్యాయస్థానానికి వెల్లడించారు. ఎన్నిసార్లు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా, వాటికి ఫలితం రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిస్సంకోచంగా రైతులపై శిక్షలు విధించడమూ, జరిమానాలు విధించడమూ ఎందుకు చేయడం లేదు? రైతులు మనకు అన్నం పండిస్తారు కాబట్టి వారు ప్రత్యేకమైనవారని.. అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా?అని ప్రశ్నించింది.

వివరాలు 

 అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు: సుప్రీం

అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉన్న విషయం పై కూడా న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు మద్దతు పలికింది. ప్రస్తుతం, ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. ఈ విషయం పై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని న్యాయస్థానం స్పష్టంచేసింది.