LOADING...
మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ 
మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ

మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ 

వ్రాసిన వారు Stalin
May 13, 2023
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ భారీ విజయంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ 'నఫ్రత్ కి బజార్' (ద్వేషపూరిత మార్కెట్)ను మూతబడిందని, కాంగ్రెస్ ప్రేమ పూర్వక దుకాణాలు తెరిచినట్లు పేర్కొన్నారు. దిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విజయోత్సవాల్లో రాహుల్ పాల్గొని మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో పేద ప్రజల శక్తి విజయం సాధించిందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. మొదటి క్యాబినెట్ సమావేశంలో చేసిన ఐదు హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ