
Kunal Kamra: కునాల్ కామ్రా మరో వివాదాస్పద వీడియో.. ఈసారి నిర్మలా సీతారామన్‌పై పేరడీ
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన పేరడీ చుట్టూ వివాదం కొనసాగుతోంది.
ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు సమన్లు జారీ చేస్తుండగా,కునాల్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ మరో పేరడీ పాటను పాడారు.
'మిస్టర్ ఇండియా'చిత్రంలోని హవా హవాయి పాటను మారుస్తూ,పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా,శిందేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కునాల్ కామ్రా ఇప్పటికే స్పష్టంగా తెలిపారు.
శిందే గురించి తాను చేసిన వ్యాఖ్యలు,ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాటలే అనుసరించానని స్పష్టం చేశారు.
తనపై దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడనని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వివరాలు
ఏక్‌నాథ్ శిందేపై కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం
ఈ వ్యవహారంలో పోలీసులు ఇటీవల కునాల్‌కు విచారణకు హాజరుకావాలని సమన్లు ఇచ్చారు.
అయితే, ఆయన హాజరు కాలేదు. వారం రోజుల గడువు కావాలని చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించి, రెండోసారి సమన్లు జారీ చేశారు.
కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై వివాదం మరింత ముదిరిన సంగతి తెలిసిందే.
ఇటీవల హబిటాట్ స్టూడియోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏక్‌నాథ్ శిందేపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
శిందేపై ద్రోహి పోల్చడంతో పాటు.. 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటను రాజకీయం కలిపి అవమానకర రీతిలో పాడారు.
దీనిపై స్పందించిన ఏక్‌నాథ్ శిందే, కామ్రా వ్యాఖ్యలు సుపారీ తీసుకున్నట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు.
వ్యంగ్యానికి, మాట స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కునాల్ కామ్రా చేసిన ట్వీట్
🍿 🍿 🍿 pic.twitter.com/KiDBbvaxSL
— Kunal Kamra (@kunalkamra88) March 26, 2025