Page Loader
Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

Rekha Guptha: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా (Rekha Gupta) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెకు ప్రమాణం చేయించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారాన్ని తిరిగి సంపాదించుకుంది, దీంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాణ స్వీకారం చేస్తున్న రేఖా గుప్తా

వివరాలు 

 నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా 

ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా,నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా ఒక విశేషమైన రికార్డు నెలకొల్పారు. గతంలో సుష్మా స్వరాజ్‌,షీలా దీక్షిత్‌,అతిశీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. సీఎం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేశ్‌ వర్మ,ఆశిష్‌ సూద్‌,మంజీందర్‌ సింగ్‌ సిర్సా,పంకజ్‌ సింగ్‌,కపిల్‌ మిశ్రా,రవీంద్ర ఇంద్రజ్‌ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేఖా గుప్తా తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. మార్గం మధ్యలో మార్గట్‌ వాలే బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భద్రతా చర్యల పరంగా,రామ్‌లీలా మైదానం వద్ద 25 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ భద్రతను సమర్థవంతంగా నిర్వహించింది.