LOADING...
Mood of the Nation Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!

Mood of the Nation Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్దికాస్త దూరంలో నిలిచిన ఎన్డీయే కూటమి,ఇప్పుడు మళ్లీ బలంగా పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం,ఈ కూటమి ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 324 స్థానాల్లో ఘనవిజయం సాధించగలదని అంచనా వేసారు. ఇది 2024లో సాధించిన 293 సీట్ల కంటే బాగా ఎక్కువ కావడం గమనార్హం. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఈ స్థితిలో ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వే ఫలితాల ప్రకారం,కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం తగ్గుముఖంలో పట్టనుంది.

వివరాలు 

బీజేపీకి సొంతంగా తగ్గనున్న బలం.. 260 సీట్లకే పరిమితం 

2024లో 234 సీట్లను గెలుచుకొని ఎన్డీయేని ఘనంగా ఎదుర్కొన్న ఈ కూటమి,ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 208 సీట్లకు పరిమితం అవుతుందని సర్వే అంచనా. కూటమిగా ఎన్డీయే బలం పెరిగినా, బీజేపీకి ఒక్కటీగా 272 స్థానాల మెజారిటీ సాధించడం కష్టమని సర్వే పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం, బీజేపీ 260 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. ఇది 2024లో గెలిచిన 240 సీట్ల కంటే ఎక్కువ ఉన్నా, ఒక్కటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపోవడం కష్టం. కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే, 2024లో 99 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు 97 స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే అంచనా.

వివరాలు 

46.7 శాతానికి పెరగనున్న ఎన్డీయే ఓట్ల శాతం 

ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగినట్లు కనిపిస్తోంది. 2024లో 44 శాతం ఓట్లు పొందిన ఈ కూటమి, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 46.7 శాతం ఓట్లు సాధించగలదని సర్వే తెలిపింది. మరోవైపు, ఇండియా కూటమి ఓట్ల శాతం 40.9 శాతంగా ఉండవచ్చని అంచనా. ఈ సర్వే జులై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది.