Lok Sabha Elections 2024-PM Modi: రెండో దశ ఎన్నికల తర్వాత ఎన్డీయే 2-0 ఆధిక్యంలో ఉంది: ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)తొలి రెండు దశల ఓటింగ్ అనంతరం బీజేపీ-ఎన్‌డీఏ(BJP-NDA) కూటమి 2-0 ఆధిక్యంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా (India) కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తనదైన మాటలతో ఎదురుదాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర(Maharashtra)లోని కొల్హాపూర్(Kolhapur)లో ఆయన మాట్లాడారు. కొల్హాపూర్‌ని మహారాష్ట్ర ఫుట్‌బాల్ హబ్ అని పిలుస్తారని, ఇక్కడి స్థానిక యువతలో ఫుట్‌బాల్(Foot Ball)కు మంచి ఆదరణ ఉందని, ఆ ఫుట్ బాల్ పదజాలంతోనే మీకు ఒక విషయం చెబుతాననంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ వ్యతిరేకత, విద్వేష రాజకీయాలు అనే అంశాలతో ఇండియా కూటమి ఈ రెండు దశల ఎన్నికల్లో సెల్ఫ్ గోల్ చేసుకుందని చెప్పారు.
ఇండియా కూటమిలో పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి: మోదీ
ఇండియా కూటమి లోని భాగస్వామ్య రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వ్యాధులతో పోల్చిన డీఎంకే(DMK)పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్న వారితోనే కాంగ్రెస్ జత కడుతోందని మండిపడ్డారు. అటువంటి వారిని కాంగ్రెస్ (Congress)గౌరవిస్తోందని...శివసేన(Shiva Sena)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని చూసి బాల్ థాక్రే ఉంటే తీవ్రంగా కలత చెంది ఉండేవారని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గాన్ని ఆయన నకిలీ శివసేనగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ)(CAA) ఉపసంహరించుకుంటామని చెబుతోందని ఇలాంటి చర్యలెవరైనా చేస్తారా అని ఇండియా కూటమి పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.