
Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ సీఏఏ (CAA) ఎంట్రీ గడువును 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీంతో పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకపోయినా,ఈ వర్గాల వారు భారత్‌లోనే ఉండే వీలుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ - 2025 ప్రకారం ఈ ఆదేశం వెలువడింది. ముఖ్యంగా 2014 తర్వాత పాకిస్థాన్ నుంచి భారత్‌కి వచ్చిన హిందువులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. వీరు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ఈ నిర్ణయం వారిలో నమ్మకాన్ని కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
వివరాలు
పాస్‌పోర్ట్ గడువు ముగిసిపోయినా.. వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టం
గృహ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం,ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మతపరమైన హింస భయంతో లేదా హింస కారణంగా భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు,బౌద్ధ, జైన,పార్సీ,క్రైస్తవ మైనార్టీలు 2024 డిసెంబర్ 31లోపు దేశంలోకి ప్రవేశించి ఉంటే.. వారికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేకపోయినా, లేదా పాస్‌పోర్ట్ గడువు ముగిసిపోయినా.. వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి కాదని స్పష్టంచేశారు. గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం,2014 డిసెంబర్ 31లోపు భారత్‌కు వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం ఇస్తామని ఇప్పటికే కేంద్రం హామీ ఇచ్చింది.
వివరాలు
ఈ గడువు మరో పది సంవత్సరాలు
తాజా ఆదేశంతో ఈ గడువు మరో పది సంవత్సరాలు పెరిగినట్టయింది. దీంతో వారికిఎటువంటి శిక్షలూ విధించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి సుకాంత మజుమ్దార్ స్పందిస్తూ - "సీఏఏ కింద భారత్‌లో ప్రవేశానికి గడువును 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.