Page Loader
Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి? 
పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి?

Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
10:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్, భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన సంఘటన అందుకు తాజా ఉదాహరణ. మంగళవారం, పహల్గామ్ ప్రాంతంలో సాధారణ పర్యాటకులపై ముష్కరులు ఆక్రమణ జరిపారు. ఈ దాడిలో 28 మంది నిర్దోషులు దుర్మరణం చెందారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబా పాక్షిక సంస్థ అయిన ''ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'' ప్రకటించింది. భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలనలో పాకిస్తాన్ ఈ ఘటనలో నేరుగా ప్రమేయం కలిగి ఉందని నిర్ధారించాయి.

వివరాలు 

భారత ప్రభుత్వ కఠిన నిర్ణయం 

ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తన చర్యలను ప్రారంభించింది. పాకిస్తాన్‌కు జీవనాడిగా వ్యవహరించే సింధు నదిపై ఉన్న "సింధు జలాల ఒప్పందం"ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెల్లడించారు. అంతేకాకుండా, పాక్‌తో దౌత్య సంబంధాలను పూర్తిగా విరమించుకొనునట్లు ప్రకటించారు. వాఘా-అట్టారీ సరిహద్దును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. పాక్ పౌరులకు భారతదేశ వీసాలను రద్దు చేశారు.

వివరాలు 

పాకిస్తాన్‌కు భారత్ ఇచ్చిన ఎన్నో అవకాశాలు 

పాకిస్తాన్ తరచూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినప్పటికీ, భారతదేశం పలు మార్లు సహనంతో వ్యవహరించింది. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో భారత్ ఎప్పుడూ సింధు నదిపై ఒత్తిడి తేలేదు. కానీ, గతంలో ప్రధాని మోడీ "రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు" అని ఈ ఒప్పందం గురించి మాట్లాడారు. తాజా పహల్గామ్ దాడి నేపథ్యంలో, భారత్ మరింత కఠినంగా స్పందించింది. ఈ చర్యల ద్వారా పాక్‌కు తీవ్రమైన నష్టాలు తప్పకపోవచ్చని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలు పూర్తిగా సింధు జలాలపై ఆధారపడుతున్నాయి.

వివరాలు 

సింధు జలాల ఒప్పందం వివరాలు 

1960లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం, తూర్పు నదులు అయిన బియాస్,రావి,సట్లేజ్‌పై భారత్‌కు నియంత్రణ ఉండగా, పడమర నదులు అయిన సింధు, చీనాబ్, జీలం నదులపై పాక్‌కు అధికారం ఇచ్చారు. దీనివల్ల 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఈ ఒప్పందంపై కాలక్రమంలో ఎన్నో వివాదాలు చెలరేగాయి.పాకిస్తాన్‌కు ఇది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తోందన్న విమర్శలు వచ్చాయి. 2016 ఉరీ ఉగ్రదాడి సమయంలో మోడీ మళ్లీ "రక్తం,నీరు కలిసి ప్రవహించలేవు"అని వ్యాఖ్యానించగా, 2023లో ఈ ఒప్పందంపై మళ్లీ చర్చించాలని భారత్ పాక్‌ను కోరింది. కానీ, పాకిస్తాన్ మాత్రం పాత ఒప్పందాన్న కొనసాగించాలని పట్టుబట్టింది.

వివరాలు 

పాకిస్తాన్‌కు ఎదురవ్వబోయే గట్టి ముప్పు 

ప్రపంచవ్యాప్తంగా తక్కువ నీటి వనరులు కలిగిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. వ్యవసాయం ఆధారంగా నడిచే ఆ దేశానికి సింధు నదీ జలాలే ప్రధాన ఆధారం. అయితే, ఈ నీటిని పంజాబ్ రాష్ట్రం మాత్రమే సమర్థంగా వినియోగిస్తోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు మాత్రం తక్కువ నీటి వనరులతో బాధపడుతున్నాయి. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే, పాకిస్తాన్ తీవ్ర నీటి కొరతతో బాధపడే పరిస్థితి తలెత్తుతుంది. పలు సందర్భాల్లో, భారత్‌పై పాక్ దాడులు జరిపినప్పటికీ , భారత్ ఎప్పుడూ ఈ నీటి ఒప్పందాన్ని ఆయుధంగా ఉపయోగించలేదు. కానీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వం మోదీ సర్కార్ ఉగ్రవాదంపై పాక్ తీరను ఉపేక్షించలేమని ఒప్పందాన్ని రద్దు చేసింది.