LOADING...
Bengaluru Stampede: ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Bengaluru Stampede: ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును సత్కరించేందుకు బెంగళూరులో నిర్వహించిన సభ విషాదంగా మారింది. భారీగా హాజరైన అభిమానుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఐపీఎల్ విజయోత్సవం నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటనపై కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అపరిశీలత, నిర్వాహక లోపాలే ఈ ప్రాణనష్టం కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు.

Details

కర్ణాటకలో పెరిగిన రాజకీయ వేడి

RCB జట్టును సత్కరించేందుకు రాజ్‌భవన్‌లోనే కార్యక్రమం జరగాలనే ఆలోచన ప్రభుత్వం పెట్టిందని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. కార్యక్రమాన్ని విధాన సౌధలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా వివరించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గవర్నర్ కార్యాలయం అధికారికంగా ఆహ్వానించిందని స్పష్టం చేసింది. అయితే ఇందుకు భిన్నంగా, సీఎం సిద్ధరామయ్య ఒక ప్రకటనలో — ఈ సభ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది కేవలం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం మాత్రమేనని చెప్పారు. సీఎం వ్యాఖ్యలకు రాజ్‌భవన్ ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చకు తావు ఏర్పడింది. ఘటనలో బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.