Page Loader
Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..
రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..

Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్‌డ్రిల్..

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించేందుకు గురువారం సాయంత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మాక్ డ్రిల్లులు ప్రధానంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలలో జరగనున్నాయి. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్లులను చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీంతో భారత ప్రభుత్వం లేదా సైన్యం దీని పట్ల ఎలాంటి కీలక చర్యలు తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది. భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాదాపు 3,300 కిలోమీటర్లకుపైగా వ్యాపించి ఉంది. ఇందులో జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని కలుపుకునే సరిహద్దు"నియంత్రణ రేఖ"గా(LOC) పిలవబడుతుంది. ఇక పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకున్న సరిహద్దులను "అంతర్జాతీయ సరిహద్దు" (IB)గా పరిగణిస్తారు.

వివరాలు 

ఉగ్రవాద శిబిరాలపై గగన దాడులు

అంతకుముందు, మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మే 6, 7 మధ్య రాత్రి సమయంలో భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై గగన దాడులు నిర్వహించింది. ఇది "ఆపరేషన్ సిందూర్" అనే కోడ్ పేరుతో చేపట్టబడింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కేంద్రం అందించిన సమాచారం ప్రకారం,ఈ దాడుల్లో ధ్వంసమైన స్థావరాలతో పాటు, పాకిస్థాన్‌లో ఇంకా 12 ఉగ్రవాద స్థావరాలు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం మరో దాడికి సిద్ధమవుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్‌ను గట్టిగా దెబ్బతీసింది. ఫలితంగా అక్కడ భయాందోళనలు మొదలయ్యాయి. భారత వైమానిక దళాలు మరోసారి అదే తరహాలో దాడులకు పూనుకుంటాయేమో అనే ఆందోళన పాకిస్థాన్‌ను వెంటాడుతోంది. ఇప్పటివరకు భారత్, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మాత్రమే గగన దాడులతో నాశనం చేసింది. కానీ ఇంకా 12 స్థావరాలు మిగిలి ఉండటంతో, వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్ మరో దాడికి దిగుతుందా? అన్న భయం పాకిస్థాన్‌లో చెలరేగుతోంది.