NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం
    తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

    Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    01:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వందేళ్లకు పైగా చరిత్ర గల ప్రసిద్ధ మైసూరు శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హంగామా సృష్టిస్తోంది.

    ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారుచేసే ఈ సబ్బుకు ముంబై నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయంపై స్థానిక కన్నడ సంఘాలు, కార్యకర్తలు,ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    కర్ణాటక ప్రభుత్వం మైసూర్ శాండల్ సబ్బు ప్రచారానికి తమన్నాతో ఒప్పందం చేసుకొని, రెండు సంవత్సరాల కాలానికి రూ.6.2 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది.

    వివరాలు 

    మైసూరు మహారాజు కృష్ణరాజ వొడయార్ ప్రారంభించిన సబ్బు 

    ఈ నిర్ణయం ప్రాంతీయ అస్తిత్వం,ప్రాతినిధ్యం విషయంలో పెద్ద చర్చలకు దారితీసింది.

    కర్ణాటక సాంస్కృతిక వారసత్వంలో భాగమైన ఈ బ్రాండ్‌కు స్థానిక కన్నడ నటి మాత్రమే ప్రచారకర్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని విమర్శకులు వాదిస్తున్నారు.

    వారు ఈ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ, కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.

    "ఈ నిర్ణయం అనైతికంగా,బాధ్యతారాహిత్యంగా ఉంది. కన్నడ ప్రజల భావోద్వేగాలకు దీన్ని గట్టి దెబ్బతీసింది. 1916లో నాటి మైసూరు మహారాజు కృష్ణరాజ వొడయార్ ప్రారంభించిన ఈ సబ్బుకు ఎన్నో సంవత్సరాల వారసత్వం ఉంది" అని ఆయన తెలిపారు.

    వివరాలు 

    మార్కెటింగ్ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం

    బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటిని ఎంపిక చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక కళాకారులను అవమానించిందని ఆయన ఎత్తిచూపారు.

    కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ ఈ విమర్శలను పక్కన పెట్టి, మార్కెటింగ్ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

    "మైసూర్ శాండల్ సబ్బును కర్ణాటకనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపునిస్తుంది మా లక్ష్యం.

    దీపికా పదుకొణె, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి ప్రముఖుల పేర్లను పరిశీలించాం.

    దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ, తక్కువ ఖర్చు, 2.8 కోట్లకు పైగా సోషల్ మీడియా ఫాలోవర్లున్న దృష్ట్యా తమన్నాను ఎంపిక చేశాం" అని మంత్రి వివరణ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమన్నా

    తాజా

    Tamannaah Bhatia: తమన్నాతో మైసూర్ శాండల్ ఒప్పందం.. కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం తమన్నా
    Zomato delivery fee: కొత్తగా 'లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు'ను ప్రారంభించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌  జొమాటో
    Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు నోటమ్‌ జారీ  అండమాన్ నికోబార్ దీవులు
    Kenishaa: జయం రవితో రిలేషన్‌.. గాయని కెనీషాకు హత్య బెదిరింపులు  కోలీవుడ్

    తమన్నా

    లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్  ట్రైలర్ టాక్
    అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్  తెలుగు సినిమా
    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  చిరంజీవి
    Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి కూతురాయేనే..బాయ్ ఫ్రెండ్‌తోనే మూడు ముళ్లు టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025