Page Loader
Amaravati: అమరావతి చుట్టుపక్కల మెడిసిటీ.. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యసాధనకు టాస్క్‌ఫోర్స్‌ సూచనలు
స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యసాధనకు టాస్క్‌ఫోర్స్‌ సూచనలు

Amaravati: అమరావతి చుట్టుపక్కల మెడిసిటీ.. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యసాధనకు టాస్క్‌ఫోర్స్‌ సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వద్ద నిర్మించనున్న రింగ్‌ రోడ్ వెంట హైటెక్ సిటీని అభివృద్ధి చేయాలని,ఇందులో కృత్రిమ మేధ (ఏఐ),సెమీ కండక్టర్లు సహా ఇతర ఆధునిక పరిశ్రమల కేంద్రాలను ఏర్పాటు చేయాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. ఇది 'స్వర్ణాంధ్ర ప్రదేశ్ - 2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి' అంశంపై దేశంలోని ప్రముఖ పారిశ్రామిక రంగ సంస్థలతో ఏర్పాటైన కమిటీ రూపొందించిన సిఫారసు చేసింది. ఎలక్ట్రానిక్స్,సెమీకండక్టర్లు,డ్రోన్స్ రంగాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలని,తిరుపతి జిల్లాలోని 'శ్రీ సిటీ' మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించింది. విశాఖపట్టణం, అనంతపురం, తిరుపతిలలో ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పాలని, అభివృద్ధి,పరిశోధన (ఆర్ & డీ) విభాగాల్లో పనిచేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు అందించాలని నివేదిక స్పష్టం చేసింది.

వివరాలు 

టాస్క్‌ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదిక

అమరావతి పరిసర ప్రాంతాల్లో మెడిసిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కూడా ఇందులో పేర్కొన్నారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్‌. చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా ఉన్న ఈ టాస్క్‌ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీలో విడుదల చేశారు. అందులో ప్రాధాన్యమైన సూచనలు ఇలా ఉన్నాయి: ప్రస్తుతానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 72శాతం వరకు విశాఖపట్నం,ఎన్టీఆర్,తిరుపతి,కృష్ణా, ఏలూరు సహా 15 జిల్లాల నుంచే వస్తోంది. ఈ జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, లైఫ్ సైన్సెస్, నీలి ఆర్థిక వ్యవస్థ, లాజిస్టిక్స్, రోబోటిక్స్, డేటా సెంటర్లు, ఏఐ, థీమ్ ఆధారిత టూరిజం, నైపుణ్య అభివృద్ధి రంగాలలో దృష్టి పెట్టాలని నివేదిక సిఫార్సు చేసింది.

వివరాలు 

రాష్ట్రసమగ్ర అభివృద్ధి కోసం 'పీ4 విధానం'

పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం రూపొందించే విధానాలు సమర్థంగా అమలయ్యేలా, అవసరమైన మార్పులు చేసేందుకు,ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ-పారిశ్రామికరంగ ప్రతినిధులతో కూడిన పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రసమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన'పీ4 విధానం'అమలు చాలా ఉపయోగపడుతుందని నివేదిక పేర్కొంది.ఇలాంటి విజయవంతమైన నమూనాలను స్వీకరించడంలో రాష్ట్రం ముందుండాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యానికి రుణ భారం అడ్డంకి కాకుండా చూసుకోవాలని,ద్రవ్య నియంత్రణ చట్టాన్ని కట్టుబట్టేలా ప్రత్యేక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది.నీతి ఆయోగ్‌తో కలిసి 'స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సిట్)'ను ఏర్పాటు చేయాలని సూచించింది.ఆదాయ వ్యయాలకు ఆదాయ వనరుల నుంచే ఖర్చు చేయాలని,రుణాల ద్వారా పొందిన నిధులను మూలధన వ్యయాల మీద వినియోగించాలని పేర్కొంది.

వివరాలు 

మెడికల్ టెక్నాలజీ జోన్

ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్)ను మరింత ప్రోత్సహించాలని, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను వినియోగించేందుకు 'ప్రపంచ స్థాయి కేంద్రాలు (Centers of Excellence)' ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు, సెమీకండక్టర్లు, ఫ్యాబ్ యూనిట్లు, డిస్‌ప్లే యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది.

వివరాలు 

రాష్ట్రంలోని పెట్టుబడులకు ఉన్న ప్రధాన అవకాశాలు: 

వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్: రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతం ఎగుమతులకు అనుకూలమైన అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీ సీఫుడ్ పార్కులు ప్యాకేజింగ్ సాంకేతికత అభివృద్ధి కోల్డ్‌ చైన్ మౌలిక వసతులు ఆహార నాణ్యత పరీక్షా ప్రయోగశాలలు వ్యవసాయ పరికరాల తయారీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ: పీసీబీలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ ఐటీ హార్డ్‌వేర్ డిజైన్ మొబైల్ కంపోనెంట్లు బ్యాటరీలు సోలార్ సెల్స్, మాడ్యూల్స్ టెలికాం పరికరాల తయారీ

వివరాలు 

జీవశాస్త్ర సాంకేతిక రంగం: 

ఏపీఐలు బయోసిమిలర్స్ ప్రత్యేక ఔషధాల తయారీ క్లినికల్ పరిశోధన మెడ్‌టెక్ జోన్ లాజిస్టిక్స్, పారిశ్రామిక మౌలిక వసతులు: అనంతపురం, విశాఖపట్టణంలలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు పోర్ట్ ఆధారిత పరిశ్రమలు పోర్ట్ ఆధారిత ఆధునికీకరణ పోర్టుల అనుసంధానం తీరప్రాంతాల అభివృద్ధి నౌకా రవాణా, ఉపరితల జల రవాణా ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ: ఈ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు హెవీ మినరల్స్, బీచ్ సాండ్ ఆధారిత రక్షణ పరిశ్రమ ఉత్పత్తి అవకాశాలు మెటల్ గ్రేడ్ టైటానియం ఉత్పత్తి నీలి ఆర్థిక వ్యవస్థ: పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో విశాల అవకాశాలు