LOADING...
Corona Virus: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి
దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి

Corona Virus: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. ఇటీవలి రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం,దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ దాటేందుకు చేరువైంది. జూన్ 2 ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం,దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,961కి పెరిగింది. ఈ మొత్తం కేసులలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,435 కేసులు నమోదు కాగా,మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483,గుజరాత్‌లో 338, పశ్చిమ బెంగాల్‌లో 331, కర్ణాటకలో 253 కేసులు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

 32కి చేరిన మృతుల సంఖ్య 

ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నలుగురు కరోనా బారిన పడి మరణించారు. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2025లో ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 32కి చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసుల సంఖ్య 3,961