LOADING...
TMC MP Controversy: అమిత్‌షా పై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. తల నరికి టేబుల్‌పై పెట్టాలి.. 
అమిత్‌షా పై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. తల నరికి టేబుల్‌పై పెట్టాలి..

TMC MP Controversy: అమిత్‌షా పై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. తల నరికి టేబుల్‌పై పెట్టాలి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మరోసారి పెద్ద వివాదానికి దారితీశాయి. బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న చొరబాట్లను హోంమంత్రి అమిత్ షా ఆపలేకపోతే ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్‌పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

హోమ్ మంత్రి 

సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదే.. 

దేశ సరిహద్దులను కాపాడే బాధ్యత హోంమంత్రిదేనని మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని చొరబాట్ల సమస్యను ప్రస్తావిస్తున్నప్పుడు, హోంమంత్రి అక్కడే ముందు వరుసలో కూర్చొని చప్పట్లు కొడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కానీ వాస్తవంగా లక్షలాది మంది అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని, మన భూమిని ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి విఫలమయ్యారని, కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ప్రకటనపై ప్రజలలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విభిన్న ప్రతిస్పందనలు వెలువడుతున్నాయి.

వివరాలు 

గతంలోను పలు వివాదాస్పద వ్యాఖ్యలు.. 

మహువా మొయిత్రా గతంలోనూ అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2021లో, ఆమె లోక్‌సభలో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై విమర్శలు చేశారు. ఆయన నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ, అతనిపై ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణలను సభలో ప్రస్తావించారు. దీనితో ఆ సమయంలో లోక్‌సభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. 2022లో, అహ్మదాబాద్‌లో మాంసాహారంపై నిషేధం నేపథ్యంలో, లోక్‌సభలో జైన సమాజం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. జైన సమాజం దీనిని అవమానకరంగా భావించగా, మాజీ ఎంపీ విజయ్ దర్దా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

గతంలోను పలు వివాదాస్పద వ్యాఖ్యలు.. 

2023లో, లోక్‌సభలో అధికార పార్టీకి చెందిన ఒక సభ్యురాలిపై దుర్భాషలాడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. 2024లో, హత్రాస్ తొక్కిసలాట ఘటన స్థలానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖశర్మతో కలిసి గొడుగు పట్టుకుని వెళ్తున్న వ్యక్తి వీడియోపై ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదానికి దారితీశాయి. దీనిపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.