Page Loader
Sikkim: సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..
సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..

Sikkim: సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ తీస్తా నదిలో పడిపోయింది. వాహనం సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి లోయలోకి జారిపోయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఒడిశాకు చెందిన బీజేపీ నేత ఇతిశ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తున్న సమయంలో, వాహనం ఒక మూలమలుపు వద్ద మలుపు తిరిగేటప్పుడు చోటుచేసుకుంది. ఆ వాహనంలో డ్రైవర్‌తో పాటు మొత్తం పదిమంది ఉన్నారు. వారు ఒడిశా,కోల్‌కతా నుంచి పర్యటనకు వచ్చిన పర్యాటకులుగా గుర్తించారు.

వివరాలు 

రాత్రంతా సహాయక చర్యలు 

వాహనం మలుపు వద్ద నియంత్రణ కోల్పోయిన కారణంగా లోయలో పడిపోయి,వేగంగా ప్రవహిస్తున్న తీస్తా నదిలో కొట్టుకుపోయింది. ఈప్రమాదంలో ఒక పర్యాటకుడి మృతదేహాన్ని అధికారులు గుర్తించగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తక్షణమే గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారిలో బీజేపీ జాజ్‌పూర్ యూనిట్ జనరల్ సెక్రటరీ అయిన ఇతిశ్రీ నాయక్ జెనా ఉండటం ఈ ఘటనను మరింత విషాదంగా మార్చింది. ఈ ప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే భారత సైన్యం,ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP), సిక్కింలోని రాష్ట్ర పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా,ప్రమాద సహాయ బాధ్యతల నిమిత్తం ప్రత్యేక హైఆల్టిట్యూడ్ రెస్క్యూ బృందాలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా రాత్రి పొద్దుపోయే వరకు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం