NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Waqf Bill: రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Waqf Bill: రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..
    రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..

    Waqf Bill: రేపు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. ఎన్డీయే, ఇండియా కూటమి బలాబలాలు ఇవే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వక్ఫ్ బిల్లు బుధవారం రోజున లోక్‌సభ ముందు రాబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది.

    ఇక, కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

    ముస్లిం సమాజం హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, ఈ బిల్లును అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు.

    ఈ బిల్లు ద్వారా వక్ఫ్ అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని బీజేపీ చెబుతోంది.

    వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌కు రాబోతున్న నేపథ్యంలో, బుధవారం ఉదయం రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది.

    వివరాలు 

    లోక్‌సభలో 8 గంటల పాటు చర్చ 

    మరొక వైపు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సభ్యులందరూ రేపు సభకు హాజరుకావాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

    వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

    ఇప్పటికే ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడైంది.

    గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లుపై చర్చ నిర్వహించింది.

    ఈ చర్చలో 14 సవరణలు సూచించబడ్డాయి. రేపు మధ్యాహ్నం లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది.

    ఈ బిల్లును లోక్‌సభలో 8 గంటల పాటు చర్చించవచ్చని సమాచారం, తర్వాత దీనిని రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది.

    వివరాలు 

    పార్లమెంట్‌లో బలాబలాలు

    వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతుందా అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.

    కానీ, పార్లమెంట్‌లోని రెండు సభలలో కూడా అధికార ఎన్డీయేకు బలం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

    ఈ బిల్లు సులువుగా పాస్ అవ్వవచ్చు. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉంది, వాస్తవానికి వ్యతిరేకంగా 233 మంది ఎంపీలు ఉన్నారు. ఇక, 11 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు.

    రాజ్యసభలో, వక్ఫ్ బిల్లుకు 122 ఎన్డీయే సభ్యుల మద్దతు ఉంది, వ్యతిరేకంగా 116 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు.

    ఎలా చూసినా, కూడా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం తప్పితే, బిల్లును అడ్డుకునే అవకాశమే కనిపించడం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వక్ఫ్ చట్టం

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    వక్ఫ్ చట్టం

    Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. 14 సవరణలకు  ఆమోదం  వక్ఫ్ బోర్డు
    Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025