అందం: పసుపు పదార్థంగా ఉన్న ఫేష్ వాష్ లను ట్రై చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందుకే అందాన్ని మెరుగులు దిద్దడం కోసం రకరకాల ఫేష్ వాష్ లు, క్రీములు ముఖానికి పూస్తుంటారు.
అయితే అందాన్ని పెంచడంలో కీలక పాత్ర వహించే వంటగది పదార్థం పసుపు కలిగిన ఫేష్ వాష్ ల గురించి మీకు తెలుసా?
పసుపులోని పోషకాలు చర్మాన్ని శుభ్రపరిచి లోపల దాగున్న అందాన్ని బయటకు తీసుకొస్తాయి. అందుకే పసుపుతో ఫేష్ వాష్ లను తయారు చేసారు. వాటి గురించి తెలుసుకుందాం.
నివియా విమె టర్మెరిక్ ఫేస్ వాష్:
ముఖం మొటిమలున్న వారు ఈ ఫేష్ వష్ ని ఉపయోగించడం వల్ల, ముఖం మీద మలినాలు తొలగిపోయి శుభ్రంగా తయారవుతుంది. దానివల్ల మీ చర్మం మెరిసే గుణాన్ని సంతరించుకుంటుంది.
చర్మ సంరక్షణ
ముఖం మీద మొటిమలను, జిడ్డుదనాన్ని తొలగించే పసుపు ఫేష్ వాష్
మామా ఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ విత్ టర్మెరిక్:
ముఖం మీద ఏర్పడే జిడ్డు దనాన్ని, దుమ్మును తొలగించి కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.
నైకా నేచురల్స్ హల్దీ అండ్ చందన్ ఫేస్ వాష్:
ఇందులోని చందనం, పసుపు కారణంగా చర్మానికి మరింత అందం వస్తుంది. మిగిలిపోయిన మేకప్ ని తొలగించడంలో ఈ ఫేష్ వాష్ బాగా పనిచేస్తుంది.
ప్లమ్ టర్మెరిక్ అండ్ వైట్ క్లే యాక్షన్ ఫేస్ వాష్:
ఇందులో సల్ఫేట్ ఉండని కారణంగా ముఖం మీద మొటిమలు తొలగిపోతాయి. సూర్యకిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో సాయం చేస్తుంది. అంతేకాదు చూడడానికి చర్మాన్ని అందంగా తయారు చేస్తుంది.