Diwali celebrations: దీపావళి పండుగ.. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పద్ధతులు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ దగ్గర వస్తున్నా,మార్కెట్లో నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.
ఈ పండుగ అందరికీ ఆనందం, ఉత్సాహం తెస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
దీపావళి అంటే అందరం ముందుగా ఇళ్లను అందంగా దీపాలతో అలంకరించడం, సాయంత్రం బాణాసంచా కాల్చడం అనుకుంటారు చాలామంది.
కానీ కొందరు దీపావళిని వినూత్నంగా జరుపుకుంటారు. వివిధ సాంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ దీపావళి వేడుకలను ప్రత్యేకంగా చేసుకుంటారు.
మరి ఏయే ప్రాంతాల్లో దీపావళిని విభిన్నంగా జరుపుకుంటారో చూద్దాం.
వివరాలు
కాళీ పూజ
పశ్చిమ బెంగాల్‌లో దీపావళి వేడుక కాళీ పూజతో సమానంగా ఉంటుంది. దుష్ట శక్తులను నాశనం చేసే మాతగా కాళీ దేవిని ఆరాధిస్తారు. దుర్గాదేవి భయంకరమైన అవతారం ఇది. దీపావళి రోజున బెంగాల్ వాసులు సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు కాళీ మాతను పూజిస్తారు.
సీతారాముల రాక
14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలతో జరుపుకుంటారు.
వారి రాకను ఆహ్వానిస్తూ దీపాలు వెలిగించి ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.
దీపావళి పండుగ రోజున రామాయణం నాటకాన్ని తప్పకుండా ప్రదర్శిస్తారు. ఈ నాటకాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు.
వివరాలు
నూతన వధూవరుల తలై
తమిళనాడు రాష్ట్రంలో నూతన వధూవరులు తలై దీపావళి జరుపుకుంటారు. వివాహం తర్వాత పుట్టింట్లో జరిగే మొదటి దీపావళి వేడుకలు ఇవి.
ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటారు. పెళ్లైన తర్వాత మొదటిసారిగా కూతురు పండుగకు వచ్చిన సందర్భంలో అల్లుడు, కూతురికి ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తారు.
గోవర్థన్ పూజ
మహారాష్ట్ర వాసులు గోవర్థన్ పూజ చేసుకుంటారు. జీవానాధారంగా భావించే పశువులను, అవులను పూజిస్తారు.
పండుగ సందర్భంగా మహారాష్ట్రీయులు ఫరల్ అనే ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తారు.
ఇందులో చక్లి, లడ్డూ వంటి రుచికరమైన స్వీట్లు ఉంటాయి. అందరూ సంతోషంగా వాటిని ఆరగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
వివరాలు
వ్యాపారుల చోప్డా పూజ
గుజరాత్ వ్యాపారులకు దీపావళి కొత్త సంవత్సరం మాదిరిగా ఉంటుంది. వారు తమ ఖాతా పుస్తకాలను పూజలో ఉంచుతారు.
దీపావళి సందర్భంగా చేసే లక్ష్మీ పూజను చోప్డా పూజ అంటారు. శారదా పూజను దీపావళి మూడో రోజు నిర్వహిస్తారు. ఇది వారికి హిందూ సంవత్సరపు చివరి రోజును సూచిస్తుంది.
నరకాసుర వధ
శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ నరకాసురుడిని వధిస్తారు. తమకు పట్టిన రాక్షస పీడను విడిచిపెట్టినందుకు గుర్తుగా ప్రజలు దీపావళి వేడుకలు చేసుకుంటారు.
గోవాలో నరకాసుర వధ నిర్వహిస్తారు, దీనిని చోటీ దీపావళిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో నరకాసురిడి దిష్టి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేస్తారు.
వివరాలు
పూర్వీకులను గౌరవించే వేడుక
దీపావళి రోజున ఒడిశా ప్రజలు కౌన్రియా కతిని జరుపుకుంటారు. ఇది వారి పూర్వీకులను గౌరవించేందుకు చేసుకునే వేడుక.
ఈ రోజు పూర్వీకులు భూమి మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు ఇస్తారని నమ్ముతారు. వారిని పిలిచేందుకు జనపనార కాడలను కాలుస్తారు. దీనిని బాదబడువా డాకా అని పిలుస్తారు.