NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Railway: భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Railway: భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా?
    భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా?

    Railway: భారతదేశంలోని ఈ రైలుస్టేషన్ల నుండి విదేశాలకు ప్రయాణం చేయచ్చని.. మీకు తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశాలకు వెళ్లాలంటే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి విమాన టిక్కెట్లు కొనాల్సిన అవసరం లేదు.

    మన దేశంలో కొన్ని ప్రత్యేక రైలు స్టేషన్లు ఉన్నాయి, ఇవి మిమ్మల్ని నేరుగా విదేశాలకు చేరుస్తాయి.

    ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుండి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి మీరు సులభంగా బంగ్లాదేశ్ చేరవచ్చు.

    వివరాలు 

    జై నగర్ 

    ఈ స్టేషన్ బిహార్‌లోని మధుబనిలో ఉంది. ఇక్కడి నుండి నేపాల్‌కు రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.

    ఇంటర్ ఇండియా-నేపాల్ రైలు ఈ స్టేషన్ నుండి నేరుగా నేపాల్‌కి వెళ్లుతుంది. సమీప ప్రాంతాల ప్రజలు ఈ రైలును ఉపయోగించి సులభంగా నేపాల్ చేరుకుంటారు.

    పెట్రాపోల్

    పెట్రాపోల్ స్టేషన్ నుండి కూడా బంగ్లాదేశ్‌కు చేరవచ్చు. ఈ స్టేషన్ ప్రధానంగా భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య దిగుమతులు, ఎగుమతుల కోసం ఉపయోగించబడుతుంది.

    సింగాబాద్

    పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉన్న సింగాబాద్ స్టేషన్ నుండి రోహన్‌పూర్ మీదుగా బంగ్లాదేశ్‌కు రైళ్లు నడుస్తాయి. ఇది అంతర్జాతీయ రవాణా కోసం ముఖ్యమైన మార్గం.

    వివరాలు 

    జోగ్బాని 

    బీహార్‌లోని జోగ్బాని స్టేషన్ నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం నుండి నేపాల్ సరిహద్దుకు నేరుగా కాలినడకన చేరవచ్చు, రైలు అవసరం లేకుండానే వెళ్ళగలిగే సౌలభ్యం ఉంది.

    రాధికాపూర్

    రాధికాపూర్ స్టేషన్ ప్రధానంగా సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. దీనిని "జీరో పాయింట్ రైల్వే స్టేషన్" అని కూడా అంటారు. ఈ స్టేషన్ నుండి బంగ్లాదేశ్‌కి రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

    అట్టారి స్టేషన్

    పంజాబ్‌లోని అట్టారి స్టేషన్ ఉత్తర రైల్వేలో చివరి స్టేషన్‌ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పాకిస్థాన్‌కు నడిచేది, అయితే ఈ రైలును 2019లో పాకిస్థాన్ రద్దు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పర్యాటకం

    400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి  జీవనశైలి
    కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  లైఫ్-స్టైల్
    ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు  జీవనశైలి
    వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి  వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025