
Dussehra2025: విభిన్నంగా దసరా పండుగ.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు?
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ పురాణాలు చెబుతున్నట్లు, చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశంలోని ప్రతి రాష్ట్రం వేర్వేరు రీతిలో జరుపుకుంటుంది. రాష్ట్రాల ప్రదేశీయ విశ్వాసాలు, సంప్రదాయాల ప్రకారం దసరా వేడుకల్లో ప్రత్యేకత ఉండే విధంగా ఉంటుంది. ఇప్పుడు, వివిధ ప్రాంతాల్లో దసరా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. భారతదేశంలో విజయదశమి అత్యంత పవిత్రంగా, శ్రద్ధతో జరుపుకునే పండుగ. దేశం అంతటా దేవీ పూజ ప్రధానంగా జరుగుతుంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలోనూ ఈ పండుగను 'కన్నుల పండుగ'గా జరుపుతారు. మైసూరు, కోల్‌కత్తా, సిమ్లా వంటి ప్రాంతాల్లో స్థానిక విశ్వాసాలు, సంస్కృతికి అనుగుణంగా దసరా వేడుకలు నిర్వహించడం సంప్రదాయం.
వివరాలు
మైసూరులో 'నదహబ్బ'
దక్షిణ భారతంలో మైసూరు దసరా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 'నదహబ్బ' పేరిట దసరా ఉత్సవాలను క్రమంగా పది రోజుల పాటు జరుపుతారు. నవరాత్రి వేడుకలను విజయదశమితో కలిపి నిర్వహించటం అక్కడి సంప్రదాయం. మైసూర్ దసరా వేడుకలకు సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దేశంలోనూ,విదేశాలనుంచి కూడా పర్యాటకులు ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వస్తారు. ఇక్కడి వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు పరిమితం కాకుండా,కర్ణాటక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. మైసూరులో అమ్మవారి పేరుగా చాముండేశ్వరి దేవి ప్రసిద్ధి.శరన్నవరాత్రి వేడుకల్లో ఆమె వైభవాన్ని చూడటం కోసం భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు.
వివరాలు
అత్యంత ఆకర్షణీయంగా మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు జరిగే ఊరేగింపు
మైసూర్ మహారాజు పాలన కాలంలో నుండి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం ఆ ప్రాంతానికి సంప్రదాయం. మహారాజులు చాముండేశ్వరి దేవిని ఆరాధిస్తూ ఏనుగులపై ఊరేగింపుగా ఊరిపోతారు. ఈ వేడుక 'కన్నుల పండుగ'లా ఉంటుంది. నవరాత్రి తొమ్మిదో రోజున రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువస్తారు. వీధుల్లో నాట్య, సంగీత, కళా ప్రదర్శనలు జరుగుతాయి, వీక్షించడానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు ఈ ఊరేగింపు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రాజభవనం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత పొందుతాయి.
వివరాలు
ప్రసిద్ధి చెందిన కోల్‌కత్తా దుర్గామాత పూజలు
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో దుర్గామాత పూజలు ప్రసిద్ధి చెందాయి. బెంగాలీలు భక్తిశ్రద్ధతో కాళీమాతను ఆరాధిస్తారు.సప్తమి, అష్టమి, నవమి తిధులలో పూజలు జరుగుతాయి. తొమ్మిదో రోజున లక్షల మందికి పైగా ప్రజలు దుర్గామాతను దర్శిస్తారు. తొమ్మిది రోజులపాటు హరికథలు, పురాణ శ్రవణం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున నదిలో నిమజ్జనం చేస్తారు. నదీతీరంలో కుమారీ పూజ కూడా ప్రత్యేకత. కోల్‌కత్తా వీధులు నవరాత్రి వేడుకల్లో కులకారంగా మారతాయి. దుర్గామాత మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించడం సాధారణం. ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా థీమ్‌లైటింగ్‌తో మండపాలు రూపొందిస్తారు. ఇవి సినిమా సెట్స్‌లను పోలినట్టు ఉంటాయి. భారతదేశంలోని పర్యాటకులు ఈ మండపాలను వీక్షించేందుకు వస్తారు. ఉత్తమ మండపాలకు బహుమతులు ఇవ్వడం కూడా ఆనవాయితీ.
వివరాలు
ప్రసిద్ధి చెందిన కోల్‌కత్తా దుర్గామాత పూజలు
కోల్‌కత్తాలోని బాగ్ బజార్ ప్రాంతంలోని దుర్గాపూజా మండపం అత్యంత ప్రాచీనంగా ఉంది. ఇక్కడ ట్రెడిషనల్ స్టాల్స్, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించడం పరంపర. కాలేజ్ స్క్వేర్ వద్ద 1948 నుండి ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. విగ్రహ ప్రతిబింబం నీటిలో చూడటానికి ప్రజలు చేరుకుంటారు. సెంట్రల్ కోల్‌కత్తాలో మొహమ్మద్ అలీ పార్క్ దగ్గర, బదమ్‌తాలా, ఎక్డాలియా ఎవర్‌గ్రీన్ ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధ దుర్గామాత మండపాలు ఉన్నాయి. ఎక్డాలియా మండపం 1943 నుంచి ప్రసిద్ధి చెందింది. ఎత్తైన విగ్రహాల కోసం ఈ మండపం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
వివరాలు
వైభవంగా ఒడిశాలో దసరా ఉత్సవాలు
ఒడిశాలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన విగ్రహాలను వీధివీధి ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా పూజలు నిర్వహిస్తారు. విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే విజయం సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతారు. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో కాల్చి ప్రదర్శిస్తారు. ప్రజలు దీన్ని వీక్షించేందుకు తరలివస్తారు.
వివరాలు
వైభవంగా గుజరాత్‌లో దసరా ఉత్సవాలు
గుజరాత్‌లో దసరా సమయంలో పార్వతిదేవి ఆరాధన జరుగుతుంది. ఇంటింటా శక్తి పూజ, గృహాల్లో శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించడం గుజరాతీయుల ఆచారం. పొలం మట్టితో వేదిక తయారు చేసి, బార్లీ, గోధుమ విత్తనాలతో మట్టి ఉండ పెట్టి నీటితో నింపి, మట్టికుండను దేవిగా భావిస్తారు. దీన్ని 'కుంభీ ప్రతిష్ట' అంటారు. అష్టమి రోజున యజ్ఞం, దశమి రోజున నిమజ్జనం జరుగుతుంది. ఆ తర్వాత పౌర్ణమి వరకు గర్భా ఉత్సవాలు, డోలు భాజాలు, రంగురంగుల వస్త్రాలలో గర్భా నృత్యాలు నిర్వహించబడతాయి. 'గుజరాతీ హారతి' నృత్యం ముఖ్య ఆకర్షణ.