Gandikota: ఫిరంగుల కంచుకోట.. శత్రుదుర్భేధ్య 'గండికోట'.. రహస్యమిదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట, పెన్నా నది తీరంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట. ఎర్రమల పర్వత శ్రేణి, పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండిని ఆధారంగా ఈ కోటకు 'గండికోట' అనే పేరు వచ్చింది. ఈ కోటను 'గండి కొండ' అని కూడా పిలుస్తారు. చరిత్ర ప్రకారం, క్రీ.శ. 1123 జనవరి 9న కాకరాజు (చిద్దన చోళ మహారాజు) ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ కోట, శత్రు దాడులకు సమర్థంగా ఎదురొండేలా నిర్మించబడింది.
గండికోట ప్రత్యేకతలు
గండికోటలో గిరి దుర్గాలు ఉన్నాయి, వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, బలమైన పునాదులు లేకుండా ఈ కోటను నిర్మించడం విశేషం. ఈ కోట చుట్టూ ఉన్న పచ్చటి పర్వతాలు, వాటి మధ్య ప్రవహించే పెన్నా నది ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. వృత్తాకారంలో ఉన్న ఈ కోట దాదాపు 5 మైళ్లు వ్యాప్తి కలిగినది. కట్టడాలు కోటలో చతురస్రాకారపు, దీర్ఘ చతురస్రాకారపు బురుజులు సుమారు 40 వరకు ఉన్నాయి. పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మినార్లు వంటి ప్రత్యేక కట్టడాలు ఉన్నాయి. నీటి వసతి కోసం చెరువులు, బావులు నిర్మించబడ్డాయి, వీటిలో భూమి అడుగున గొట్టాలు వేసి చేసిన నీటి సరఫరా ప్రత్యేకంగా ఉంటుంది.
చరిత్రలో గండికోట ప్రాధాన్యం
16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి తిమ్మానాయుడు, రామలింగనాయుడు గండికోటను పరిపాలించారు. విజయనగర రాజ్య విభజన తర్వాత, కుతుబ్ షాహీలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోట చరిత్ర రాజుల శౌర్యాన్ని, యుద్ధతంత్రాలను ప్రతిబింబిస్తుంది. గండికోట లోయ అందాలు పెన్నా నది ఇరుకు లోయలో 300 అడుగుల వెడల్పులో ప్రవహిస్తుంది. ఎర్రటి గ్రానైట్ శిలలు, నదీ ప్రవాహం, పక్షుల స్వరాలు ఈ ప్రదేశం అందాన్ని మరింత ఇంపుగా చేస్తాయి. ఆలయాలు, మసీదు ఇక్కడ ఉన్న రంగనాథ ఆలయం విజయనగర శిల్పకళా వైభవాన్ని తెలియజేస్తుంది. అలాగే, మాధవరాయ ఆలయం కూడా మరొక దేవాలయంగా ఉంది. ఇక జామియా మసీదు ఇండో-ఇరానీ వాస్తు శైలిలో ప్రత్యేకంగా నిర్మించబడింది.
గండికోటకు చేరుకునే మార్గం
కడప నుండి 85 కిలోమీటర్ల దూరంలో గండికోట ఉంది, ఇది 2 గంటల ప్రయాణం. జమ్మలమడుగు నుండి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే దూరం. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది.