
Ghibli Photo: 'లవ్ ది న్యూ ఆఫీస్': నెట్టింట్లో వైరల్‌గా మారిన శామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల జీబ్లీ ఫొటో ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై జీబ్లీ (Ghibli)శైలిలో రూపొందించిన ఏఐ ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓపెన్‌ఏఐ సంస్థ తమ చాట్‌జీపీటీ ప్లాట్‌ఫారమ్‌లో జీబ్లీ స్టూడియో స్టైల్‌ను పరిచయం చేసిన తర్వాతే ఈ ఫొటోలు వినియోగదారుల మధ్య విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.
నెటిజన్లు ఈ సదుపాయాన్ని ఎంతో ఆసక్తిగా ఉపయోగించుకుంటున్నారు.ఈ ట్రెండ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతూ,ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఒక ప్రత్యేకమైన జీబ్లీ స్టైల్ ఫొటోను షేర్ చేశారు.
ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో కలిసి ఉన్న జీబ్లీ వెర్షన్ కనిపించింది.
''కొత్త ఆఫీస్‌ను నాదెళ్లకు చూపించాను.మా మధ్య జరిగిన చర్చలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి'' అంటూ ఆల్టమన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వివరాలు
ఇద్దరినీ ఇలా చూడటం ఎంతో బాగుంది
దీనికి బదులుగా, ''నిన్ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆఫీస్ చాలా బాగా ఉంది'' అంటూ నాదెళ్ల స్పందించారు.
ప్రస్తుతం వీరి జీబ్లీ స్టైల్ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.
''ఇద్దరినీ ఇలా చూడటం ఎంతో బాగుంది'' అంటూ నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు.
జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ అనుసరించిన యానిమేషన్ శైలిలో రూపొందిన ఈ ఫొటోలు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.
చాట్‌జీపీటీకి చెందిన కొత్త ఇమేజ్ జనరేటర్ ఈ శైలిని అందించడమే కాకుండా, ఎక్స్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన గ్రాక్ చాట్‌బాట్ ద్వారానూ ఈ తరహా ఫొటోలను రూపొందించుకోవచ్చు.
వివరాలు
వ్యక్తిగత గోప్యతపై ఆందోళనలు
అయితే ఈ ట్రెండ్‌తో పాటు, వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)పై కొన్ని ఆందోళనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
జీబ్లీ ఫొటోలను రూపొందించేందుకు వినియోగదారులు తమ ఫొటోలు, వ్యక్తిగత వివరాలను అప్లోడ్ చేస్తున్న సందర్భంగా, అవి ఆ సంస్థల డేటాబేస్‌లలో నిల్వ అవుతుంటే... భద్రతా దృష్ట్యా ఇది సమస్యాత్మకమవచ్చు.
ఇప్పటివరకు ఈ సమాచారం గోప్యంగా ఉంచినా , ప్రస్తుతం ఈ తరహా ట్రెండ్‌లతో అది కంపెనీలకు చేరే అవకాశం ఉంది.
అందువల్ల, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో మాత్రమే ఇలాంటి ట్రెండ్‌లలో పాల్గొనాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.