
World Cup 2023: రసవత్తరంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ బెర్తును ఖారారు చేసుకుంది.
ఇక బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం.
సెమీస్‌లోని రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది.
ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన అఫ్గాన్, పెద్ద జట్లతో పాటుగా సెమీస్ రేసులో నిలవడం విశేషం.
ఆస్ట్రేలియా ప్రస్తుతం 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రాబోయే మ్యాచుల్లో ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది.
ఈ రెండు మ్యాచుల్లో ఆసీస్ నెగ్గితే తప్పకుండా సెమీస్‌కు చేరుతుంది.
Details
ఆఫ్గాన్ కు మెరుగైన అవకాశాలు
న్యూజిలాండ్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక శ్రీలంకతో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్ శ్రీలంకపై విజయం సాధించినా, మిగిలినా మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ ఓడిపోతే ఆ జట్టు సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.
పాకిస్తాన్ 8 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో(0.398)తో పోలిస్తే, పాకిస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ (0.036) తక్కువగా ఉంది.
మిగిలిన మ్యాచుల్లో న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ జట్లు ఓడిపోతే పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
ఆఫ్ఘనిస్తాన్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
మిగిలిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆ జట్టు విజయం సాధిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ఆఫ్గాన్ సెమీస్ స్థానాన్ని సొంతం చేసుకుంటుంది.