Page Loader
ICC World Cup 2023 : ప్రపంచ కప్‌లో లెఫ్టార్మ్ పేసర్లు సాధించిన అద్భుతమైన రికార్డులివే

ICC World Cup 2023 : ప్రపంచ కప్‌లో లెఫ్టార్మ్ పేసర్లు సాధించిన అద్భుతమైన రికార్డులివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2023
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి సమయం అసన్నమైంది. భారత్ వేదికగా మరికొన్ని గంటల్లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో లెఫ్టార్మ్ పేసర్లు సాధించిన రికార్డుల గురించి ఓ సారి తెలుసుకుందాం. ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థిని గడగడలాడించే న్యూజిలాండ్‌ స్టార్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ సిద్ధమయ్యాడు. బంతిని ఎలాగైనా స్వింగ్ చేయగల అత్యుత్తమ బౌలర్లలో బౌల్ట్ ఒకరు బౌల్ట్ పవర్‌ప్లే ఓవర్లలో (1-10) 99 ఇన్నింగ్స్‌లలో 21.26 సగటుతో 87 వికెట్లు సాధించాడు. 23.56 సగటుతో వన్డేల్లో 197 వికెట్లను పడగొట్టాడు.

Details

38 మ్యాచుల్లో 55 వికెట్లను తీసిన వసీం అక్రమ్

ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పేసర్‌ ని చెప్పొచ్చు. ప్రపంచ కప్ టోర్నీలో వసీం అక్రమ్(55)ను అధిగమించడానికి స్టార్క్ ఏడు వికెట్ల దూరంలో ఉన్నాడు. పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ లెఫ్టార్మ్ పేసర్‌గా నిలిచాడు. అతను ఐదు ఈవెంట్లలో (1987-2003) 38 మ్యాచ్‌ల ఆడి 55 వికెట్లతో సత్తా చాటాడు. 1992 పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ గెలవడానికి వసీం అక్రమ్ కీలక పాత్ర పోషించాడు. అతను ఈ టోర్నీలో 18 వికెట్లను తీశాడు.

Details

వన్డేల్లో 282 వికెట్లను పడగొట్టిన జహీర్ ఖాన్

శ్రీలంక మాజీ దిగ్గజం చమిందా వాస్ వన్డే ప్రపంచకప్‌ టోర్నీలలో కీలక పాత్ర పోషించాడు. అతను శ్రీలంక తరుపున నాలుగు ప్రపంచ కప్ మ్యాచులను ఆడాడు. 31 మ్యాచుల్లో 49 వికెట్లను సాధించాడు. 2003 ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా అతను వన్డేల్లో 400 వికెట్లను తీశాడు. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 29.43 సగటుతో వన్డేల్లో 282 వికెట్లను తీశాడు. 23 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో జహీర్ 44 వికెట్లను పడగొట్టాడు.