Page Loader
Tendulkar- Anderson Trophy: వాయిదా పడిన టెండూల్కర్ - అండర్సన్‌ ట్రోఫీ ప్రారంభోత్సవం 
వాయిదా పడిన టెండూల్కర్ - అండర్సన్‌ ట్రోఫీ ప్రారంభోత్సవం

Tendulkar- Anderson Trophy: వాయిదా పడిన టెండూల్కర్ - అండర్సన్‌ ట్రోఫీ ప్రారంభోత్సవం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో గురువారం చోటు చేసుకున్న విమాన ప్రమాదం నేపథ్యంలో, ప్రముఖ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, జేమ్స్‌ అండర్సన్‌ల పేరుతో ప్రారంభించనున్న ట్రోఫీ నామకరణ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా జూన్ 14న, శనివారం నాడు లార్డ్స్‌ మైదానంలో నిర్వహించాలని అనుకున్నారు. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ (ECB), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంయుక్తంగా నిర్వహించాల్సిన ఈ ప్రారంభోత్సవం, అత్యవసర కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఈ ట్రోఫీ నామకరణానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈసీబీ, బీసీసీఐ అధికారులు ఈ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

వివరాలు 

టౌడీ ట్రోఫీ  పేరు మార్పు 

గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో సుమారు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనకు అంజలిగా, శనివారం లార్డ్స్‌లో జరగాల్సిన ట్రోఫీ నామకరణ కార్యక్రమాన్ని చివరిదశలో వాయిదా వేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతంలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య జరిగే టెస్ట్‌ సిరీస్‌లో విజేతకు పటౌడీ ట్రోఫీ అందించేవారు. అయితే ఇటీవల ఆ ట్రోఫీ పేరును మార్చారు. దాని స్థానంలోనే క్రికెట్‌ దిగ్గజాలైన టెండూల్కర్ -అండర్సన్‌ పేర్లతో కొత్త ట్రోఫీని ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.