తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Anushka Sharma: టీమిండియా ఓటమి.. విరాట్ కోహ్లీని హత్తుకొని ఓదార్చిన అనుష్క
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Nov 20, 2023 
                    
                     09:43 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీ ఫైనల్ వరకు ప్రత్యర్థులకు హడలెత్తించిన భారత్, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. టీమిండియా ఓటమితో విరాట్ కోహ్లీ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ సమయంలో విరాట్‌కు అనుష్క శర్మ అండగా నిలబడింది. విరాట్ కోహ్లీని కౌగిలించుకొని ఓదార్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలైన ప్రేమ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరాట్ కోహ్లీని హత్తుకున్న అనుష్క శర్మ
#AnushkaSharma caught in a candid moment with #ViratKohli post the World Cup Finale. pic.twitter.com/gnTPDpZkxJ
— Filmfare (@filmfare) November 19, 2023