LOADING...
Lionel Messi: భారత్‌ కు మెస్సీ.. వాంఖడే స్టేడియంలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం
భారత్‌ కు మెస్సీ.. వాంఖడే స్టేడియంలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం

Lionel Messi: భారత్‌ కు మెస్సీ.. వాంఖడే స్టేడియంలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో భారత్‌కు పర్యటనకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. టీమిండియా మాజీ, ప్రస్తుత ప్రముఖ క్రికెటర్లతో కలిసి మెస్సీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ కథనాలు వాస్తవమేనంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇ వివరాల్లోకి వెళ్తే, మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 వరకు భారత్ పర్యటించనున్నాడు. ఈ సమయంలో ముంబయి,ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో తన అభిమానులను కలవనున్నాడు. ఇది ఒక ప్రమోషనల్ టూర్‌ లో భాగంగా జరుగుతుందని సమాచారం. గత 14 ఏళ్లలో భారత్‌కు మెస్సీ చేయబోయే ఇది రెండో పర్యటన.

వివరాలు 

వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్

చివరిసారి 2011లో కోల్‌కతాలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అప్పుడు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వరల్డ్‌కప్ గెలిచిన తరువాత ఆయన భారత్‌కు వచ్చారు. ఇప్పటికే మెస్సీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే, డిసెంబర్ 14న మెస్సీ ముంబయికి చేరుకుంటాడని తెలుస్తోంది.వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈనేపథ్యంలో,ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాంఖడే స్టేడియాన్నిఆ రోజుకు బుక్ చేయాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ను(MCA)ఇప్పటికే అభ్యర్థించింది. ఇటీవల జరిగిన MCA సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. సచిన్ టెండూల్కర్, ఎం ఎస్ ధోని , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర క్రికెటర్లతో కలిసి మెస్సీ ఈ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

వివరాలు 

కోల్‌కతాలో చిన్నారుల కోసం ప్రత్యేక ఫుట్‌బాల్ వర్క్‌షాప్

షెడ్యూల్ పూర్తిగా ఖరారైన తరువాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంతేకాక, కోల్‌కతాలో చిన్నారుల కోసం ప్రత్యేక ఫుట్‌బాల్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మెస్సీ గౌరవార్థంగా 'GOAT CUP' పేరుతో ఓ ప్రత్యేక మ్యాచ్ నిర్వహించనున్నారని సమాచారం. ఇక కేరళ పర్యటనపై సందిగ్ధత ఏర్పడింది. గతంలో అర్జెంటీనా జట్టు అక్టోబర్ లేదా నవంబర్‌లో కేరళకు వస్తుందని అక్కడి యువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్ రహిమాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అయితే ప్రస్తుతం మెస్సీ డిసెంబర్‌లో మాత్రమే భారత్‌కు రానున్నారన్న విషయమై షెడ్యూల్ తుది దశలో ఉండటంతో.. అంతకుముందు భారత్‌కు వచ్చే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.