Rohit-Virat: రోహిత్, విరాట్ కోహ్లీలను ఇక టీ20ల్లో చూడలేమా?.. కారణం వాళ్లేనా?
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli),రోహిత్ శర్మ(Rohit Sharma) దశాబ్ద కాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించారు. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత వీరిద్దరూ టీ20లకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా, భారత్ గత ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది.టీమిండియా విజయాల్లో యువ క్రికెటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ,రోహిత్ శర్మ తప్పకుండా ఆడతారనడంలో ఎలాంటి అనుమానము లేదు.
సీనియర్లా.. జూనియర్లా..? ఎటూ తేల్చుకోలేకపోతున్న సెలెక్టర్లు
అయితే 2020 టీ20 ప్రపంచ కప్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు. వీరంతా 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లే . సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టు కూడా యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్ కి కూడా జట్టులో స్థానం లభించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌ల్లో మాత్రమే అవకాశం ఇచ్చి, ఇక టీ20లకు యువ క్రికెటర్లు ఎంపిక చేయాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.