Yusuf Pathan : భద్రతపై బీసీసీఐ నిర్ణయం సరైనది.. యూసఫ్ పఠాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. హైబ్రిడ్ మోడల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లదు అని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా, భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారత క్రికెట్ దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తే, పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మాత్రం రాజకీయాలు, క్రికెట్‌ను వేరుగా చూడాలని వ్యాఖ్యానించారు. టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ ఈ అంశంపై స్పందించారు.
ఆటగాళ్ల భద్రతపై స్పందించిన యూసఫ్ పఠాన్
బీసీసీఐ ఎప్పుడూ ఆటగాళ్ల భద్రత గురించి ఆలోచిస్తుందన్నారు. ప్లేయర్ సేఫ్టీ, దేశం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని, ఇది సరైన నిర్ణయమే అని యూసఫ్ పఠాన్ అన్నారు. ఐసీసీ సమావేశాలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కోసం అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటన ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.