
Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత టెస్టుల్లో ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించాలి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహిస్తుండటంతో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.
ఈ మెగా టోర్నీలో భారత్ విఫలమైతే, కొంతమంది ఆటగాళ్లు, కోచ్ పై వేటు పడే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచ కప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ప్రపంచ కప్ తర్వాత సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్టుతో భారత్ టెస్టు సిరీస్ ను ఆడనుంది.
ఈ నేపథ్యంలో కోచ్ ఎంపికపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. రాహుల్ ద్రావిడ్ ను టెస్టుల్లో కొనసాగాలని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
Details
టీ20, వన్డేలకు ప్రత్యేక కోచ్ ను ఎంపిక చేయాలి
ఒకవేళ భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్‌ను సాధిస్తే, రాహుల్ ద్రావిడ్ తన కాంట్రాక్టును పునరుద్ధరించుకోనే అవకాశం ఉంటుంది.
అయితే వన్డే ప్రపంచ కప్ తర్వాత టీ20, వన్డేలకు ప్రత్యేక కోచ్‌ను నియమించి, ద్రావిడ్‌ను టెస్టుల్లో కోచ్ నియమిస్తే మంచిదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు వేర్వేరు కోచ్ లుగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఆసియా కప్‌లో సూపర్ 4కు అర్హత సాధించిన టీమిండియా జట్టు, సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో మరోసారి తలపడనుంది.