శుభ్‌మన్ గిల్‌కి పదికి నాలుగు మార్కులు.. ప్రయోగాల వల్లనేనా!
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో మోత మోగించారు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించారు. ఇక టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషాన్, యశస్వీ జైస్వాల్ తన మార్కును చూపించుకున్నారు. వీరిద్దరూ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పరిస్థితి భిన్నంగా మారింది. మూడో స్థానంలో వచ్చిన అతను రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు.
శుభ్‌మాన్ గిల్‌పై విమర్శలు
శుబ్‌మాన్ గిల్ తొలి టెస్టులో 6 పరుగులకే పెవిలియానికి చేరిన గిల్, రెండు మ్యాచులో 10, 29* పరుగులను మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. వెస్టిండీస్ సిరీస్ ప్రదర్శన కారణంగా గిల్ కు 10కి 4 మార్కలు ఇస్తున్నానని, ఈ సిరీస్ లో అంచనాలకు మించి రాణించలేకపోయాడని, భవిష్యత్తులో కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాడని జహీర్ ఖాన్ అశాభావం వ్యక్తం చేశాడు. నంబర్ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం పడుతుందని బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ పేర్కొన్నారు.