
ICC Rankings: టెస్ట్ ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ.. దిగజారిన జైస్వాల్, విరాట్ కోహ్లీ ర్యాంకులు.. నెంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకున్నాడు.
జైస్వాల్ ఇప్పుడు నాల్గో స్థానంలో చేరగా, విరాట్ కోహ్లీ ర్యాంక్ 14వ స్థానానికి పడిపోయింది.
కాగా, జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం, టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ తన 161 పరుగులతో ఆకట్టుకున్నాడు.రెండో ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 161 పరుగులు చేసిన జైస్వాల్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 825 పాయింట్లతో నాల్గో స్థానానికి చేరుకున్నాడు.
వివరాలు
టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్
ప్రస్తుతం, రెండో ర్యాంక్ లో హ్యారీ బ్రూక్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ, పెర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, కానీ అతను 689 పాయింట్లతో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
రిషబ్ పంత్ పెర్త్ టెస్ట్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగే చేశాడు.
అయితే, ర్యాంకింగ్‌లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. 736 పాయింట్లతో, అతను ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం, టాప్-10లో కేవలం పంత్, జైస్వాల్ మాత్రమే ఉన్నారు. టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 895 పాయింట్లతో ఉన్నాడు.
వివరాలు
ఆరో స్థానానికి జడేజా
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు, అలాగే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా టాప్-10లో ఉన్నారు.
బుమ్రా ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీశాడు.
అశ్విన్ ఈ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు, అతను నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.
జడేజా తన ర్యాంక్‌ను మెరుగుపరచుకొని ఆరో స్థానానికి చేరుకున్నాడు.