Page Loader
Sri Lanka: ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!
ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే! ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!

Sri Lanka: ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. ఆసియా కప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన శ్రీలంక, ఫైనల్ మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది. ఇక అక్టోబర్ 5న భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీ కోసం ప్రస్తుతం శ్రీలంక సిద్ధమవుతోంది. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచులో రాణించినా శ్రీలంక జట్టు ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను మరోసారి కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచుల్లో శ్రీలంక సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

Details

ఆరుసార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంక

1996లో లాహోర్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసి, మొదటిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత వరుసగా 2007, 2011లో వరుసగా ఫైనల్స్‌కు చేరుకొని, ఆస్ట్రేలియా, టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఇక శ్రీలంక ఆరుసార్లు (1975, 1979, 1983, 1987, 1992, 1999, 2019) గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2003లో సెమీస్‌కు చేరిన శ్రీలంక, 2015లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ESPNcricinfo ప్రకారం, 1975 నుండి 2019 వరకు, శ్రీలంక 80 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఆడింది. ఇందులో 38 మ్యాచుల్లో నెగ్గగా, మరో 39 మ్యాచుల్లో ఓటమిపాలైంది.

Details

1996లో కెన్యాపై అత్యధిక పరుగులు చేసిన శ్రీలంక

స్వదేశంలో ఆడిన తొమ్మిది ప్రపంచ కప్ మ్యాచుల్లో లంక ఏడింటిలో విజయం సాధించింది. ఆసియాలో 21 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడి, 12 విజయాలు, 8 ఓటములను నమోదు చేసింది. 1996లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక అత్యధికంగా 398 పరుగులను చేసింది. ప్రపంచ కప్ మ్యాచుల్లో శ్రీలంక 12 సార్లు 300 కంటే ఎక్కువ పరుగులను చేయడం విశేషం. అత్యల్పంగా 1975లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో లంక 86 పరుగులకే ఆలౌటైంది. ఇక 2003లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక రెండోసారి అత్యల్పంగా 109 స్కోరు చేసింది.

Details

శ్రీలంక తరుఫున అత్యధిక పరుగులు చేసిన కుమార్ సంగక్కర

శ్రీలంక తరుఫున ప్రపంచ కప్ మ్యాచుల్లో కుమార్ సంగక్కర అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 56.74 సగటుతో 1,532 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలను బాదాడు. సనత్ జయసూర్య (1,165), తిలకరత్నే దిల్షాన్ (1,132), మహేల జయవర్ధనే (1,100), అరవింద డిసిల్వా 1,064 పరుగులు చేసి తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రపంచ కప్ మ్యాచుల్లో శ్రీలంక తరుఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ చరిత్రకెక్కాడు. అతను 19.63 సగటుతో 68 వికెట్లను పడగొట్టాడు. లసిత్ మలింగ 56 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

Details

అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముత్తయ్య మురళీధరన్ రెండో స్థానం

వన్డే ప్రపంచ కప్ చరత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మురళీధరన్ (68) నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మెక్ గ్రాత్ 71 వికెట్లు పడగొట్టి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. దిల్షాన్ శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌పై దిల్షాన్ 161* పరుగులను సాధించాడు. 2003లో బంగ్లాదేశ్‌పై చమిందా వాస్ చేసిన 6/25 అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.